కల, వరించినది నిజ'మనుకున్న మనసు!
నిదురలో అనుభవాలే.భవమైన పగలూ,
తద్భవమైన కర్మా రాత్రి.. నిదుర పక్కపై
ఎక్కడివో లోకాలు ఎప్పటివో జ్ఞాపకాలూ
,నిజాలై సజీవంగా నటిస్తాయి. భయమై
వూపిరి బిగించినా మెలకువ రాదప్పుడు.
చప్పుడులేని ప్రకంపనలూ,ఇప్పుడుకాని
దృశ్యాలూ, అన్నీ మెలకువలో విచిత్రాలూ
, చెప్పుకోలేని ఒప్పుకోళ్ళూ. తప్పుకు
ఒప్పుకున్నాలేకున్నా తక్షణ శిక్షలూ,
హృదయమా ఎన్ని శిక్షలంభవించావూ,
నిదురలో చచ్చి మెలుకువలో ఎన్నిసార్లు
బతికావూ. దేముడూ సమాజమూ
నిలవరించకపోయినా, నీ మనసు నీకు
చురకలేస్తూనే వుంది కదూ. మరి మైకంలో
మనసూ ఎమైపోయావూ, అప్పుడు నువ్వు
నిదురపోలేదా,లేక బుద్దిని నిదురలో ఖననము చేశావా? లేదు,
బుద్దికీ, మనసుకూ సంబంధములేదు.
సుఖమన్నది అనుభవైక్యమైతేనేగా ధు:కము దరిచేరేదీ.
ప్రమిదెకి చమురు అహంకారము దానికి వత్తి వ్యసనము
, తగులుకుంటేమండేది ధర్మము,కాలేది ఖర్మము
. రాలిన వుసుళ్ళ రెక్కల సాక్ష్యము
కబోది ప్రేమకు కరగిన కలల బతుకు.
మనసుకు రాని భాషలేవి? భాష తెలియని భావాలేవి?
భావానికందని వెతలుఏవి? గుండె చెరువు
కడుపుకోత భాధ ఏది? కన్న బిడ్డ పుచ్చుప్రేమ
పచ్చిమైల నక్క మాట నగుబాటు దాపురింపు కంపు కద
. ఒక్క బిడ్డ కొద్ది బుద్ధి దొడ్డ మాట దొడ్డిదారి దొంగ
నక్క ఎంగిలి ముక్క ఎంచి చూడ వంకాయ తొడిమ
వంకరే అంగట్లొ గుగ్గిళ్ళు పాచే, తొడ తొక్కిడీ
కురచ తక్కెడ రోతకి వీసము ఎక్కుడు చేతకి
పదలము తక్కుడు పిదప కాలమే పిచ్చి మనస
కుడప చేటపెయ్యి నయము గదె
ఎడదను తన్ని గడప దాట నెంచ దగునె ???
why one can not hold the breath alas!\
time has two shadows till now and hence after,
whimsical and fluid is the now,
that neither stays a while nor joins with either
< but can always make a mark
be it a turn in life or an end to it.
the past refers only to ego
as one goes to desire
and no one cares to inspire
of things that senses dictate
mind throws all its stakes
the heat is spent in dreaming
perhaps day in and out scheming.
ద్వాదశి వ్రతము లాంటి వ్రతమూ
,గాయత్రి లాంటి మంత్రమూ,
మాతృదేవతా,ఆకలికి దొరికే అన్నమూ,
దప్పిక అయినపుడు దొరికిన సాధు జలమూ
అత్యంత పుణ్య గణ్యములట.
నాయగారూ, పొద్దున్నే కనిపించారుగా!
పదమూడోరోజే సాఇజ్యాన్ని పొందారనుకున్నా.
, మరి తెల్లారగట్ల పూర్ణరూపముతో కనిపించారూ,
ప్రసాదమిదుగో సంచీ తెస్తానుండని మళ్ళీ వెళ్ళిపోయారు?
కలలో ఎంతో యెదురు చూస్తూనే వున్నా
మెలకువలో నిజము గ్రహించా. మీరిక రారనీ,
నేకన్నది కల అనీ. తండ్రీ దివ్యలోకంలో
మాస్పృహ మీకెందుకు గానీ
, మేము నిత్యమూ మీస్పృహలోవుండేలా
దేముడు వరమిస్తే చాలు. మీ ప్రతిపదమూ
మాకు పరమ పదమే,మీ చిరునవ్వు పరమేస్వర ప్రసాదమే
చివరకు చెదిరిన ఝ్నాపకాలూ మరువంపు పరిమళాలే.
అమ్మ పెట్టిన పాల బువ్వా, మీరు చెప్పిన పసిడి కధలూ,
ఎంత అదృష్టము చేసుకున్నామోమాకు కరగని సంపదలేగా
పంచివ్వలేకపోయాము మాపిల్లలకి, అయ్యో పెంపకములో లోపమే
. మీరిరువురూ నలదమయంతులవునో కాదో మేము కుచేల సంతానమే,
అయితేనేమీ, కృష్ణ ప్రసాదము మాకొదిలిపెట్టారుగదూ.
మా అదృష్టమేమవునో మీఅంశ ఫణిరాజ షేష శయనాంశ
వశము తప్పుతున్న మా అంశ శేషము
స్వీకరించునో లేక మరొక యవన ంలేచ్చ
,వణిజ గణిక ఖిలాపాక సిలాశాసనము రచియింపబడునో.
తండ్రీ ఎట్లో శ్రీరంగని సూక్తము మా గళములందు
నిలుప పొలిఘ పొలిఘ ని కలగ దీవించ గలరె.\
No comments:
Post a Comment