MY STORY
ఇక్కడ ఒక తాత వున్నాడు. వాళ్ళ వూరేమో ఎప్పుడో,మొగల్తుర్రు.
వాళ్ళు, ఇదివరకు అంటే,1958 దాకా మదరాసు పాత మాంబళంలో వుడేవారు.
వాళ్ళ నాన్న గారు, షట్చక్ర సీతా రామా చార్యులు గారు(ఇప్పుడు లేరు లెండి),
వాళ్ళ అమ్మ పేరు అంటే మీకు నాయనమ్మవాళ్ళ అమ్మో,అమ్మమ్మా వాళ్ళ అమ్మో వరసకే సుమండీ అవుతారన్నమాట.తరవాత వాళ్ళు పాలకొల్లు వచ్చేశారు, అక్కడ వాళ్ళ
చిన్నాన్న గారు, శేషాచార్యులుగారు డ్రిల్లు మాష్టారు అప్పుడు అంటే 1960 అన్నమాట.
ఆయన 73 దాకా డ్రిల్లు మాస్టారే. వాళ్ళ అబ్బయి శేషయ్యంగారు, ఆర్ టీ సీ లో పంజేసి రిటైరు అయాడు,కాకినాడలోవుంటున్నాడిప్పుడు. నేను అంటె ఇప్పటి తాతని,మా నాన్నగారూ, అక్కలూ ఇద్దరూ,చెల్లెళ్ళు ముగ్గురూ,తమ్ముళ్ళు ముగ్గురూ అందరమూ,నూజివీడువచ్చేశాము. అక్కడ రెండొ మూడో ఎళ్ళున్నాము,
మా పెదనాన్న గారు,శ్రీ నారాయణా చర్యులుగారు గొప్ప హింది మాస్టారు,కాని అన్నీ వచ్చు ఆయనకి,
మా కజిన్స్ బాగా చదుకోనీ, బాంకుల్లో పెద్ద ఆపీసర్లుగా చేసి రెటయిరు అయ్యారు.
నేను కూడ కొంచెము చదువుకుని మిలిటరీలోకెళ్ళి మళ్ళీ బాంకులో చేరి గుమాస్తా గానే రెటయిరు అయిపోయి ఇప్పుడు హైద్రాబాదులో వుంటున్నాను. మా పెద్దమ్మయిచెన్నై లో వుంటుంది ( అంటె నే పుట్టిన వూరు దగ్గర). మా రెండొ అమ్మాయి M.Sc చదివి ఇంకా రీసెర్చట చేస్తానో అంటుంది కాని ఓ పట్టాన అవ్వదు, మంచి సేటు రాలె.ఇంఖొ చిన్నది అంటే మూడొ అమ్మాయి, మయిసూరులొ కష్టపడి చదూకుంటోంది. ఇప్పుడు, మా,మూడో అమ్మాయి పెళ్ళిచెయ్యాలి గా. అందుకనే మా నాన్న, అమ్మా, నాయనామ్మ అమ్మమ్మా బందువులందరినీ, తెలుసుకోని వరసైన మాంచబ్బాయికిచ్చి పెళ్ళిచెయ్యాలి. తాతొ, మామో మీకేమౌతానొ, ఎదురుపడినా పడకపోయినా కొంచం పరిచయం చేస్తారుకదూ. మీ యందు ఆశీర్వచన శుభాకాంక్షలతో, సత్యము మామ.(తాత)
No comments:
Post a Comment