మనసా విశ్వానికి శ్వాసవి నీదు విశ్వాసము /చీకటి వెలుగుల కతీతముగా
చీకటి వెలుగుల కతీతముగా
మూతలు పడుతూనే వున్నాయి
తలపులు జ్ఞాపకాల చుట్టూ పరుగులు పెడుతూ
మెలకువని ప్రస్నిస్తూనేవున్నాయి
నిజము స్వాప్నికమా, స్వప్నము
నిజమా?,అని మనసూగిపోతూనేవుంది.
దేనికదే నిజమన్నట్లు దానికదేచివరన్నట్లూ
మనోవాక్కాయాలు తడబడిపోతున్నాయి
ఆమధ్య తిరువణ్ణామలై వెళ్ళి
రమణా ఎమైనా గుట్టువిప్పుతావా ?
అని మనసడిగింది. ఆమరణమూ
ఆలోచించాల్సిన విషయాన్ని అర నిముషములో
కనుగొందామనుకొన్నావా, పిచ్చిమనసా
,సామీప్యంలో సాన్నిహిత్యాన్ని
,సాన్నిహిత్యంలో సంస్కారాన్ని
ముందు పొందూ వలయం చుట్టూ తిరిగావా
,అహాన్ని వదిలావా అయితే ఇంక లోపల వెతుక్కో
,అని అంతర్వాహిని, కోయిలై పాటపాడినట్లూ,
చెట్లూ చేమలూ,తలలూచి నా స్వగతాన్ని
అవధరించినట్లూ, అని పించింది. కానైతే
మరి కాసంతసెపే, కాళ్ళు నిలబడ్డాయి,
తరువులూ గిరి తమాషాగా వెక్కిరించాయీ
నీవేమీ వీరుడివి కావు నారాయణా,
చక్రాంగితాలున్నాయి సరేకానీ,
ఇంగితము మరవకని నిదుర సన్గతులూ,
నిజమైన సంగతులంటూ వేరే ఎమీ వుnడవనీ,
కాలమూ ముందుకూ వెనక్కూ తిరిగేదనీ
గట్టిగా వురుములతో కురిసిన వాన చెప్పింది,
నిజమని చెట్లూ చేమలూ, గాలీ వెలుతురూ
సాక్ష్యము చెప్పాయి.మరణ మంటే మరేమీ కాదు
నిన్ను నువ్వు నేనూ , నాదీ అనుకోవడమేనట,
నా చక్రాంగితాలూ, నేనూ మేకు కేసిన చొక్కా
గావంచా అని తెలుసుకోవాలట,
రాత్రో, పగలో నిద్రలొనూ,మెలకువలొనూ తెలుసుకోవాలిట
గదీ, గోడలూ లోకరీతి బంధాలే అనీ తెలుసుకోవాలిట
కానైతే మనసు గురుతెరిగేనా,
మనసా విశ్వానికి శ్వాసవి నీదు విశ్వాసము
అంతరాళ ప్రణవము. చక్రాంగితములు నీ
కన్నులు సుమా వివశత నీదు చరిత
దూరకుమా వివరములవెంట జన్మ
జరాదికములంటతగులు నీదునాత్మ
మరల ధుఖితమతి యగు. వెన్నుడి
చిన్న యశొద నీయమ్మ, కన్నుల
వెలుగు నీదు తండ్రి, గారవమున
గురుతుగల గురువు. కామ చోదిత
ప్రేమ నేరక కోరిన మనసా శ్వానము
ఘట భంధిత హీనత వద్దన్న వూడని
తరి మలిన ప్రచరిత జీవనమౌను.
ఘన జీవన సాఫల్యత నీజీవన ఝురికావలె
సుమా మరల నెట్టి జన్మమెత్తుదుమొ
తలి తండ్రుల దీవన దక్క
ఏది జన్మ జన్మాంతర రక్ష నీకు?
No comments:
Post a Comment