Wednesday, September 9, 2015

Tuesday, 30 September 2014 at 10:38 UTC+05:30

వాయువు ప్రాణాధారమే/నిశీధి సంకల్పానికి జోల




వాయువు ప్రాణాధారమే,
అది లీనమైన స్వరము నాదమే,
అది కంపనమైన తరంగమే
అది అంతరంగమైన మనోజ్ఞమే
,అది మాయాఛేదిత మైన మౌనరాగమే
,అది భారనాశక వూర్ధ్వగామిత్వమే,
అది భవసంసార విమోచక ఆత్మానంద పోషకమే,
అది మనోజ్ఞ సచ్చిదానంద హేతువే,
అదే, ఋషి పరిపోషిత దివ్యత్వము,
మునిగణ శోధితమూ
,మౌన వీణియ రాగమూ
, జ్ఞాన దీప చోదితమూ
ఆత్మకి జీవన సాఫల్యమూ!!

Sunday, 28 September 2014 at 11:46 UTC+05:30

నిశీధి సంకల్పానికి జోల
నిద్ర అసంకల్పిత తురీయావస్థ
కల కోరికల సముద్రములో
సంకల్పమనే అల
రాగ ద్వేషాలు
మనో వికారాలకు ఆటుపోట్లు.
బుద్ధి అహంకారమూ
నిద్రలో అచేతనమే.
కామ క్రోధాలు
కలలోనూ ప్రచలితమే
. అందుకనే
తమసోమా జ్యోతిర్మయా
అంటే మాయా తోలగిపో
,అని బుద్ధి ప్రార్ధిస్తోంది.
గలు వంటికి చుట్టుకున్న
పది కరణాలూ
న్యూనత వల్ల చిక్కిన దేహానికి
వదులైపోతున్నాయి.
వదలలేని బుద్ధి మనసుని
పట్టుకు వ్రేలాడుతోంది.
ఆత్మానందము నవరంధ్ర
పతనమై మనో ఘట
పటలము సుష్కమైపోతోంది.
చిల్లపెంకులను పరచి బుద్ధిచిల్లుకుండకి
రూపాన్నివ్వాలని ఆసిస్తోంది.
చావూ అసంకల్పిత తురీయావస్తే.
కానైతే నిద్ర నుండి బొందలేస్తే
చావునుండి ఆత్మ లేచిపోతోంది.
దేహమా అని మనసు ఏడుస్తోంటే,
బంధము తెగిన ఆత్మా పాత్రత
మరిచేవా అదిగో మనసూ
మరణ యాతన పడుతోంది
పాత్ర ముగించావా
మళ్ళీ మనసు కావాలా
గర్భావాసము తప్పదైతే.


ఆలోచనా సంవిధానాన్ని పరిశీలించడానికి విమర్శ,తార్కికత,తులనాత్మకత, స్వప్రయోజనా రాహిత్యమూ,తటస్తత,నిర్ధార్నాత్మక అవశీలనమూ, ముఖ్యాంశాలు. ప్రతీ వ్యక్తీ సంకల్పికముగానో,అసంకల్పితము గానో ఆలోచిస్తూనే వుంటాడు, కానైతే, చక్కటి వ్యవస్తితమైన ధోరణి సత్య స్పూర్తికి సులువైన సరళగ్రాహకమైన మార్గాన్ని ఏర్పరుస్తుంది. అట్టి ఆదర్శ పూరితమైన ఆలోచనా సంవిధానానికి కొన్ని నిర్దుష్టమైన మౌలికాంశాలు: నిరపేక్షతా,నిర్మల భావుకత,వినయ ప్రకటన, సాకల్యతా భావన, మూల్యాంకనా నిర్దుష్టత పక్షపాత రాహిత్యమూ, ప్రామాణికతా నిరూపణమూ, సత్యసోధకతా తప్పక కలిగివుండాలి.

Satyanarayana Charyulu Maringanti
ప్రతి వీక్షణమూ మనోదర్పణ శోషితమే
ప్రతి క్షణమూ బుద్భుధ విస్ఫోఠనమే
కాల పరిత్యాగంలో ఖడ్గఛాలనం
దిక్కుల చుక్కలతోరణంలో
దిగంతాల వెంటవూగిసలాడే
దివంగత ఆత్మలద్యుతి
ఉల్కా శకల సకలం!
పైనించి తలక్రిందులాకాశం
క్షతానక్షత్ర విచిత్రం
ఏది పగలు ఏదిరాత్రి దిగంతాల పరివ్యాప్తిలో?
ఏది సత్యమేదిమిధ్య మస్తిష్కపు వితర్క మధనంలో

No comments:

Post a Comment