కాశి యందు కడుపేద బాపడొకడు
కాశి యందు కడుపేద బాపడొకడు
మేటి దాన శీలి, ఒక్కనికైనం బెట్టక
సొక్కడు సకుటుంబముగ తీర్థమైనను
ప్రేమమీర కామితార్ధములనెంచక
నిత్య కష్టార్జితములెల్ల ఇష్ట నష్టములౌతరి
ఒక్కనాడు నిత్యకైంకర్యము పిదప
శేష భుక్త ప్రసాదము గైకొనుతరి
బిక్షాందేహి యని శ్రావ్య ధ్వానమయ్యె.
దిగ్గున లేచి అన్యుడు రాడు
సాక్షాత్ శంభుడే అయ్యుండనోపని
యెంచి కనుగొనె వాకిలి చెంత నాకొన్న
నొక్క జిన శ్రామణక తీర్థంకరు డొక్క చిక్కి
మిక్కిలి డాసియున్ననాతని కైగొని దక్కి
యున్న భొజ్యములారగింపుచేసె
కడుపారగ నారగించిన భిక్కు
తనకవసానమాసన్నమయినదని
తన తనువాబాపనింట సార్ధకమౌనని
తరువాతిదినమున తనుఒచ్చి
ఓరవాకిటనిల్తునని తదుపరి తన
తలపై రోకటిపోటొక్కటి పెట్టుమని
కడువిధముల నచ్చజెప్పిచనె .
ఆబాపడన్యాసక్తుడు కాకుండినచేసి
మరునాడు తననిత్యవిధుల సల్పి
ధనార్జకై వేగిరపడుచున్నతరి
మరచిన దిగంబరజినుడేగుతెంచి
ఓరవాకిలిజొచ్చి,తనవెంటదెచ్చిన
దండమునా బాపనికిచ్చి
'దండమూర్దన మొనరింపు'
మని మిక్కిలివేగపరుప,
వీతరాగభయక్రోధరహితుడగు
బాపడు కడు భక్తి శ్రద్దల దండి
తలను దండముతో మూర్కొన
ముద్ద బంగారమయ్యె,జినుడు.
ఈవిధములెల్ల నొక్క మంగలి
నక్కిచూచి మిక్కిలి ఆశకలవాడై
'ఆహ! ఎమి చోద్యమిది,నొక్క
దండ ప్రహరమున విచ్చు
బంగారమయ్యె బోడి భిక్కు,నే
నొక్కతరే మిక్కిలి భిక్కుల ప్రొగు
చేసి లెక్కకు మించిన పసిడి
పొందెద'నని ఎంచి మరునాడు
,బిక్కు సముచ్చయముంజేరి
తను యొక వ్రతార్ధమై భిక్కులకా హార
మీయదలచితినని పరి విధముల
నమ్మించి అనేక రోకళ్ళను,అన్వెక
పరివారమున్ను సిద్దము చేసికొనె.
పిమ్మట మరుదినము,భిక్కుల రాకకయి
తనవారితొ నక్కి చూచు తరి,
ఆకొన్న భిక్కులు ఆవురావురనుచు
నొచ్చిరి,సాధువులై వరసదప్పక.
ఒక్కొక్కరినొక్కొకతరి లోనికి రానిచ్చి
రోకటిపోటుల దండన మాడ దొడగె
దురాశామోహితుడజ్ఞాని మన మంగలి.
మొర్రోమను రోదనలు పిక్కటిల
చుట్టుపక్కల వారరుగుదెంచి చక్కగనా
క్షురకు పరివార సహితముగ
నొక్కచిక్కని తాటినగట్టి
రంజకుడగు రాజున కప్పజెప్పిరి.
విచారము చేసిన ధర్మ శీలి రాజు,
బాపని చూసి,దాన గణ్యపుణ్య
మహిమనెంచి,తీర్థకరులకు
నిత్య నిరతాన్న దాన సేవా
విషేషములొనర్చ నియోగించి,
మంగలిని మందలించి,జినునికి తా
దాసుడయ్యె,అర్ధ కామముల విడిచి.
No comments:
Post a Comment