ఇప్పుడు నే జీవించిన క్షణం
ముద్ర చెదరిన నిద్రలోంచి
కనుకొలకుల మెలకువలోకి
తొంగిచూచిన, తొణికిన స్వప్నం
సంసారముతో మోక్షము బడయుట
శరభమునెక్కి వైతరణి గడచుటయే
కురసాని వాముదెచ్చి కుడితితో శుద్దిజేసి
పరగడుపున తిన్న పుఱ్ఱెట్లు శుద్దౌను?
సుర గ్రోలి ఖఱమెక్కు నరపాలులార
విషపూరిత సుర వుసురులు తీయద!
అనృతమాడ నేరము అని యాచరింతురె?
మాటలు సుద్దుల మూటలెట్లౌను?
కాటుకలవంటి చీకటి జీమూతములద్రుంచు నీలమేఘ అనఘా
దాశరధి ఏలను రాయి రప్పల నీరూపు కప్పురంబు నుప్పురాయిగ
చేతురు,నిలువగ నీవె నిఖిలాత్మలందు! కాలుచేతులాడునందాక
నీకాలుమ్రొక్కెదము మాటలుడిగినప్పుడు,చేష్టలుదక్కినపుడు
గ్రంధులు వాటముడిగినప్పుడు సవ్వడి వడిదప్పినప్పుడు
ఎప్పుడెప్పుడాబొంది విడివడునన్నప్పుడు కనబడుగాక నీరూపు
నాదారి ఇదియదియని వేసారిపోదుము ఎఱుక ఏమార్చి
గర్భావాసము కూర్చుదువు. రాదారితప్పి గోదారి దూరిన సంసారి
తెన్నులుగానక కన్నుల చీకటులుప్పతిల్ల చుక్కలచూచి చిక్కులు
గడవగనెంచ మిన్నువిరిగి మీదపడుచందాన దిక్కుమాలిపోవు
జీవి వికార విహ్వలముల విషణ్ణమౌ ఏల నీలీల?
No comments:
Post a Comment