మనసంతా సంతాపమే జరుగుతున్న సంగతులు,
ఇప్పటిదాకా కనుపించని, మెలకులోకూడా నిద్రిస్తున్న
, సమాజములో చీకటి కోణాలు. ఏమూలనో రావణ
కాష్టం ఇంకా రగులుతోనేవుంది. కానైతే ఆయనకీ
మాన మర్యాదలు మనకన్న వున్నట్లే అనిపిస్తోంది
. శిసువుల్ని కంసుడిలా కడతేర్చకపోయినా,
నఖరాలతో విదారించి విందారగిస్తున్నారు
మనలో మృగత్రుష్ణ బరి తెగించి గ్రీష్మ తాపమౌతోంది
. చీకటి చిరుగుల్లో అమ్మల్ని పురుగులుఏరుకు తింటున్నయి.
జాతికి నిజంగా మళ్ళీ గ్రహణం పట్టిందా?
రాజూ రధంలాగే మంత్రీ నీచ లో,నిక్రుష్టా చేష్టితమైపోయారు
. ప్రజలుడొక్క సుద్ధి కోసం క్షుద్ర పూజలు చేస్తున్నారు.
తామర తంపర్లు గా జనాలు జనాంతికంగా పోగై
జాతరలో గానుగ ఎద్దుల్లా పరవలయంలో గిరికీలు
కొడుతూ ఛత్రం పడుతూ చామరాలు వీస్తున్నారు.
నిజ వర్తులాన్ని విడిచి నీచ లోకొచ్చాడుశుక్రుడు
వక్ర ద్రుష్టే,రాజుదీ, మంత్రిదీ, మనందరిదీ
ఇక దారేదీ మంచికి కధ కంచికి చేరేదెల్లా?
No comments:
Post a Comment