Thursday, September 10, 2015

Thursday, 2 July 2015 at 06:18 UTC+05:30
.

శరణం యామి యాన్యస్మిన్ దైవతాని వనస్పతౌ!


పంచభూతముల అంశలె జీవుల ప్రాణములు
చిరుమొలక సాగి తరువై శాకోపశాఖల విస్తరిల్లు
పక్షి అక్షయములకావాలమై పుడమిన వెలుగు
చెట్టు చేమలు బృహదాత్మలు జ్ఞాన సిఖలు
ఎంచవవి గుణగణముల వుఛ్ఛనీచముల
కరుణన ఇచ్చును నీడను,ఫలముల
తమ కాయము మన నెలవుల కాలవాలము
మున్ను,మరియు జీవికకు తేట వాయువుల
నిచ్చలు నీయవె పూయక కాచెడు చెట్టున
దేవతలుందురట పూచియు కాయని చెట్టును
రాలచె గోట్టిన ఒకబోయి వ్యధ తెలివిడిచేసెడి
కధ కనుగొందుము మనిషి బుద్ధి పరి పరి విధముల
నెట్లుమెలగు విధి బారిన పడి హింసా వ్యాసంగమున
వళ్ళుమరిచిబెనగు వాడొక్కనాటి రాతిరిచిక్కె పెను
వానంబడి అతగాడు భీత హరిణములను చేత చీల్చెడివాడు
అంచుకు జాలి దయ శాంతముల నెరుగని వాడు

No comments:

Post a Comment