వెలుగువెన్నెల గోదారి బాటన
వెలుగువెన్నెల గోదారి బాటన
రాదారి పడవ మోసులెత్తె
మసకవెన్నెల సంపెంగల నెత్తావి
కొబ్బెరాకుల మాటున సాగిన
నెలరేని కిరణాల కుంచె
బాపు గీతల కైత
మెరుపు మొబ్బుల పైటనద్దె
చూతురే ఈ వింత చూచిన
చెరగదీ బొమ్మ నిలిచి
మందహాసమై మదిన పూయించు
గిలిగింతలు మాపాలకొల్లు పూలపల్లి
కంతేరు రోజాలకు ముళ్ళుండవు
పాల తీపి పూతరేకుల,
తేనెలోమాగిన తియ్యమామిడుల
పల్లెందాల పరవళ్ళుకూడిన
గుండెవూసుల కొసరుండును
రేపు రాని బాపుకు తోడైన
వెన్నెల కుంచె వెలవెలపోయి
వెన్నెలారగించ నిచ్చగించదే. .
ధర సింహాసనంబై నభంబు గొడుగై తద్దేవతల్భృత్యులై
పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రియై
వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయాణా !"
Other day I happened to see the painting of baapu in the violet and purple shop near KPHB BHAAGYANAGAR COLONY and bent my head and prayed to LORD SREEMANNAARAYANA who was seated in the full court. WHAT A SURPRICE THAT the NOBLE SOUL passed away next day before really I could complete the appreciation of imagination and its culmination into art hearty and live and enliven for all the times to come. The aesthetic sense and devout devotion of the creative mind is vividly seen in the craft.
వనమో కవనమో మనమును
చేకొన్న సుషుమ్నము ఘనమే.
ఎరగని మానవ తీరములను
గమించును, నవమే అనుభవము,
భవ సంచితమో తమోగుణ బద్దమో
జీవనము అననుగుణము ఒకపరి
రణము వరణము దాటిన మరణమే
,కాని,చెదిరిన స్వప్నమే. స్వేదము
స్వప్నాంచితమే,మెలకువ మోదమే
మరల స్వప్నము, మరల విభ్రమము,
తొలగిన సంశయము జీవనమను పగటి
సత్యము,కలయను పరకాయప్రవేశం నిక్కము
తిరిగి తిరిగి చేదు నిజము,నీడకన్న పొడవు.
Tiruvengalan Swaamin updated his status.
వ్యాస దేవుడు వేదముల కాలవాలమైన గణముల గుణముల వరణముల ఆవరణముల వరముల వివరముల వెలుగుల నగవుల వనముల మనముల పలుకల నడతల ఆద్యంతలముల కధిపతి గణపతి దేవుడు నృత్య లాశ్యమున తటిల్లత,గానమున గుణాడ్యుడు గరిమగల దేవుడు కడు వినమృడైన పార్వతీసుతుడు పరుషములేక పాతకుల పీచమడచినాడు చంచలమౌ చందురు మనసునగొన్న వలపుకాండ్రకు పెద్ద దేవుడీతడు బుద్దిని సుద్దినిచ్చి మన్నన జేయు,మరి పూజింపరే వాంఛితములీడేరగ.
No comments:
Post a Comment