Monday, September 7, 2015

Wednesday, 21 August 2013 at 04:48 UTC+05:30





నా చిన్ని ప్రపంచంలో నే నొక్కడినే చక్రవర్తినప్పుడు.
అక్కడ పాటలూ,మాటలూ, నవ్వొలూ,పువ్వులూ,
నా చుట్టూనే తిరుగుచుండేవి. అప్పుడప్పుడు
మా అమ్మ అలసినప్పుడు నాకాకలి వేసేది
మా అమ్మమ్మ చేసిన అరిసెలో,పిన్నమ్మ
వండిన జిలేబీలో అక్కరకు వచ్చి నా ఆకలి తీర్చేవీ.
ఎదీ మా అమ్మ ఎప్పుడూ,చప్పుడు లెకుండా
ఎదో పని చేస్తూనే వుండేది,ఆమే పనే నాకు ఝోల
నెమ్మది గా గుస గుస గా మాట్లాడినా,
నాన్న కన్నా అక్క కన్నా నాకే తెలిసేది ముందు,
మధ్యలో వీడొకడు పని చేసుకోనీకుండా,
అని అమ్మనుకున్నప్పుడు నాక్కోపమొచ్చేసేది
, అప్పుడాకలో అని అమ్మ నీళ్ళో పాళో తాగేది.
అందరూ నన్ను గురించి దూరం దూరం గా అమ్మ కి
తిరుగాడే వారు, తాత గారైతే
మీ అమ్మగారొస్తే బావుండ్నెమో అనే వారు,
పరవా లేదండీ నిమ్మళంగానే వున్నా
అనేది మాయమ్మ, రోజూ, దీపం పెట్టి కృష్ణుడో,
దెముడో నాకప్పుడు తెలీదు కాని కూని రాగాలు తీసేది,
చాలే, నే పాడతాకానీ నువ్వలా కూచో, అనే వారు,
ఎప్పుడైనా వచ్చే అంగల్లు గారు. ఒకరోజున అనుకోకుండా
అంటే నెను కాదు,వాళ్ళు, నేను పుట్టేశాను,
గాట్టిగా నాబొడ్డు కోసేశారు నా అరుపుకు (
అంటే యేడుపని వాళ్ళబాషలో)మా తాతగారు
హడ్డిలి పోయారుట,కానీ మాపెద్ద మేనత్త అంగల్లు గారు
వీడు రాభణాసురుడే అని దీవించారుట.
నేను మాత్రం మా అంగల్లు అత్తగారికీ
,ఆతర్వాత మా రంగయ్య బావకీ,
సిమ్మాడ్రిబావకీ,అయ్యంగారు బావకీ వీర భక్తుడినైపోయా
అప్పట్నుంచీనూ మా సత్యభామ వదిన
మా నాన్నత పెద్దది, నన్ను మాత్రం బావా
అనే పిల్చేది, మా నాన్నని ఒరై రాముడుమామా అన్నా
,అన్నట్లు,నేపుట్టినప్పుదే, మా అచ్చ్మ్మాళ్ళు బావ గారు
అంటే నాకన్నయ్యలెండి దొరికారుట,
(ఈవిడా కూడా ఒక పేద్ద దేవత సుమండీ)
అంటే చెన్నై మాంబళంలోనే,అక్కడేగా,
నే పుట్టి లోకాన్ని వుద్దరించింది, ఎన్ని గొప్ప (వెధవ)
పనుల్చేశానో మా అమ్మకీ నాన్నకీ తెలీకుండా.
నిఝముగా నే మరీ అంత మంచబ్బాయిని
కాపోయినా కొన్ని నమ్మకాలుండేవి,అవేంటంటే
, లెడీసు అందరూ దేవతలేననీ అంజలీదేవి పేద్ధ దేవతనీ
, ఆంజనేలుస్వామే అందరికన్నా గోప్ప దేముడనీ,
ఇప్పుడూ అంతే సుమండీ కానీ మా ఆవిడ
నా అభిప్రాయాలని పెద్దగా ఒప్పుకోదనుకోండీ
ఇది నాకధ ఎందుకు చెప్పానంటే ఈరోజు, నా పుట్టిన రోజనీ
అందరూ నన్ను, మరీ మన్నించేశారుగా
దుకనీ,ఇప్పుడు నిజంగా బుద్ధి గానే
వుండాలని అనుకొంటున్నా లేపోతే మా కన్ని,
పండూ జమ్మి గాడూ, గున్నూజీ వూరుకోరు.
ఇట్లు అందరికీ ప్రేమతో (అమ్మబాబో ప్రెమకాదు
ఇష్టంతో సత్యం మామ,బాబు మరియు,
చిన్నప్పుడు పాలకొల్లు పిన్ని పిలిచిన బడుద్ధాయి.

No comments:

Post a Comment