Tuesday, September 8, 2015

Thursday, 5 June 2014 at 08:52 UTC+05:30

హైదరాబాదు కాదురా



.
హైదరాబాదు కాదురా ఇది
బురదరా బాబు చూసి అడుగేయి !
కుతుబు సాబు కలగన్న తీరుకాదురా
హరిత ధరిత్రికి శాలువకప్పబోయిన నవాబూ
మురుగు చీరకట్టిన పూర్వసువాసినే
నేటి అభాగ్యనగరి నీఆత్మ ఎంత ఘోషిల్లునో 
విరిగిన కల గాంచి పారెడి వైతరణి పై పెనుఓడ నిర్మాణాలూ
జారేవిలువల కురచైన సహజతా
ఎదకుళ్ళిన మూసీ ప్రేమగాధ
తలుచుకుంటే దానయ్యని నాగుండే మండిపోతోంది
తలవంపుల మానవ పంకిలాన్ని తలచుకుని!
నవాబూ,  ఇక్కడ కలలెందుకు కన్నావు??
ఏఅరబ్బు దేశానో అయిన  గొప్ప రూపుండెడిదిగా;
మారుండెడిదిగా నీకల కల్పతరువుగా నిలిచుండెడిదిగా

No comments:

Post a Comment