Monday, September 7, 2015

Friday, 31 May 2013 at 21:57 UTC+05:30

కదర్యుడు




జన బోధ తిమిర విమోచకము అవమానము కాదు సమ్మానమే,వింటే.
పూర్వ కర్మ ఫలము సంచితమౌను, క్షాళనకై కటువైనంగావచ్చు,
బోద్దల వచోపరిమళము అవస్యము అవధరించవలె కదర్యుడొక విప్రుడు,
కడు కోపి, పరమ లుబ్దుదయ్యు మిగుల కాముకుడు
ధర్మ కర్మ హీన గృహమాతని దేహము,నిత్య విమశ నిరతాంత
పీడనములాతని ఆతని ఆభరణములట,భర్త అయ్యుండి
భరించెడివాడు కాడట,కర్త అయ్యుండి కర్మలనవహేళన చేసెడివాడటఅకటా!
ధు:ఖితులౌ దారాసుత సేవకజన మాతనియందు సతతము అప్రియులయ్యిరి.
ధన కాముక భేతాలు డుభయలోక భ్రష్టుదగుటంజేసి,
విధి కృద్ధమయి అయ్యాతని కాలసర్పమై కాటువేసె.
స్వజన తిరస్కృతుడై విచార మ్లాన మనస్కుడై మిక్కిలి చిక్కె.
పరార్ధముకాని పరమార్ధమెరుగని సంపద నాశకమే కాని మోదకము కాదుగదా
మిక్కిలి శోకతప్త మానస్కుడయ్యె. వైరాగ్యభావన సభూతమయ్యె.
జ్ఞాన కిరణ సందర్సనమున చిత్తభ్రమలడగిన యాతని అలాపన
సురుచిర స్వగతమై, "అహా!ధన మనర్ధము పదునైదు విధములవి
దంభాక్రోధక కామ చొర,భెధ,వైర,విస్వాసరాహిత్య స్పర్ధామద మోదక జూద,
మధ్యపానాది విస్మయ అహంకారములని,క్రోధజనిత అసత్య భాషణమతి న్యూనమని,
చిన్నదయ్యు కుష్టక క్రిమి రూపానంద హేలను నికృష్ట ఖండిత ప్రెతము పగిది
షుష్కించగలదని ధనరతిమతులను లుబ్దులను క్రోధోన్మత్తులను
సకల బంధుమిత్రులు సౌహర్ద్రము చెడి నిక్కము వదిలివైతురూ కదా
అని పరి పరి విధముల వితర్కించె. దెవ దానవులు మెచ్చెడిది
మానవజన్మ సాత్వికత కందమూలాది పోషిత జన్మముకడు ప్రాకృతికము
మీదుమిక్కిలి ష్రేష్టము. ఇయంగేహే స్వయం మోక్షద్వారము దేహం.
ఆకలి యన్న మృత్యువు.కామమన్న పాములపుట్టనిజుట్టి
మరి మరి మారులు జీవి జన్మించి చచ్చుట. చావు నిక్కమైనపుడు
ధనమార్జనము వైతరణిని గమించుటకు సాయమగునా
ధనకామాదుల భ్రమ చీకటిగద్యమున
రాగమోహరుచిరార్ణవ ఆకటి పద్యము.
ఎవ్వరివలన ఈపెంజీకటి మాయావరణము
నాకవగతమైనదో అట్టి హరి తప్పక
వైరాగ్య శాంత స్వాస్థ్యములిచ్చుగాక
నాజీవముల నిక చైతన్యముగలదేని
నిష్కాముకుడనై ఉత్థారకమౌ ఉత్తరా పధమె
నాకు గమ్యమగు గాక! అని,
కృత నిశ్చయ మనస్కుడయ్యె. continued to part 2

No comments:

Post a Comment