Tuesday, September 8, 2015

  తెలుగులారా/ ఫుడమి వడిన/చలము అచల మేమీకాదు





తెలుగులారా వెలుగు రేకలార
అధర్వులార అంధక పుత్రులార
గార్గేయులార గౌరాంగులార
గోగోత్ర ప్రవారాన్విత పుత్రులార
మెలకువలో జాగృత, నిదురలో జాగృత
నడకలో మెలకువ నిలకడలో మెలకువ
ఆమని అంచున చీకటి అంచున
పొంచి పొంచి వున్నది వంచన తల్లీ
తలపూ,మనిషి మర్యాదా...


 ఫుడమి వడిన విడిదైన అడవీ
నీదు గుండెల చడిచప్పుడా
నాటిపడిగ గొడుగు అలరేడు
అవనిజకైవడి తరుల ఎడద
బిగియార సుడిజుట్టి
అడుగడుగున హా సీత హా సీత
యని కన్నులరమూసిగీలించుచు
నడచిన వడి వడి అడుగుల చప్పుడు గాదె.
ఎంతటి భాగ్యశాలివమ్మ అడవి తల్లి!
సూర్య చంద్రులు కనరాని నీదు చిక్కని...
తనను కనిపెంచిన తనువును
తన చేతన తనువైన తనకును
తానైన తన్వికి నెలవైన
తన్మయమతి ధరిత్రీ వందనము.


చలము అచల మేమీకాదు చలిత
చాలన కలము చలము కలం రేపిన
గాయాల మనసులు మనసు మైల
చేయని వూసులు వూసులెరుగని
వయసు మీరిన మనుషులు
కోమలి సోమరి కోరిక గైరిక కాలిన
మనసుకు తీపరి చితికాలని చావు
వెరసి కొసరి వడ్డించిన కవి కాని
కాని చలించి చేత తొడ కొట్టుకుంటూ.
వికట సామాజిక వ్యధా చిత్రకుడు చలమే

No comments:

Post a Comment