.
అజమైనా గజమైనా
అజమైనా గజమైనా పరివృత్తములోభ్రమిస్తూనేవుంటాయి
భ్రమలు తొలిగిన పిదప గజేంద్రుడు శ్రమావసిష్టమైనాడు
నిజానికి మావిలోమాయలో ఆత్మ వెలుగొందే ప్రాణమే
అనుకుంటే,జన్మంటే మావిలోంచి మాయలోకనే
జన్మించడమనే ఆమరణ ప్రయాణమే. నే నవజాతాన్నయినప్పుడు
సుమసోభిత విమానములో దిగంతాలమధ్యన విహరించినగుర్తు.
తర్వాత పయస్సుగ్రోలి ప్రపంచములో పడ్డాను.
పళ్ళు రావడముతోనే పుట్టకతోవచ్చిన మూలమంత్రము
మేలమాడే వేళ కాకాసురుడెత్తుకెళ్ళాడు. వెతుకులాట
వేళ చిన్మయదశలోంచి మృణ్మయపాత్రలోకిజార.
వర్గాలువేరైనా మిత్రులే అయిన ఆరుగురూ
తోడైన పెద్దలనుంచి తోడుకాని పొరుగులదా
వేలెడు పిన్నలనుంచి వ్రగ్గులైన వౄద్ధులదాకా
చూస్తూ,నెనూ వ్రేళ్ళసందులగుండా అనుభవించాను
. ఇక ప్రేమంటే స్తూలంగానూ, సూక్ష్మంగానూ తెలిసినవాళ్ళు
మోక్షగాములనీ తత్పరులనీ ఇచ్చపూర్వక జీవులనీ
దాసులనీ,వసువులనీ వాసుదేవ బృత్యులనీ
అత్య్తుగొల్చువారనీ స్రీవ్య్షణవులనీ నిజమనీ భావించా.
నిజాన్ని చూడనిచ్చగించడము నిజంగా కస్టసాధ్యమే.
No comments:
Post a Comment