Tuesday, September 8, 2015

Wednesday, 15 January 2014 at 18:59 UTC+05:30

ఆదమరచీ సేద తీరేనా నా మనసు




చేరువ చేరువ గీముల పల్లె
మందార లద్దిన ముంగిళ్ళ శోభ
బొడ్డురాయికి బెడ్డ దూరములొ
తామర కొలను దేవర కొలువు
దూరము దూరము నీలమ్మ కొండలు
చీకటి రాత్రుల జారిన చుక్కలు
దారికి దిక్కు,వెన్నెల రాత్రులు
ఆటల పాటల కలగలుపు కదంబాలు.
ఈవూర గోదారి ఆవూర క్రిష్ణమ్మ
మద్దిలేరు సుద్దలేరు మద్దెనా కొల్లేరు
మున్నేరు పక్కనా బుడమేరు
,కడలేరు దగ్గరా మానేరు
పర్రలో తోలేరు తొర్రలో తమ్మిలేరు
తమ్మలో,బొమ్మిలేరు బొమ్మలో గొబ్బెమ్మ
,బతకమ్మ,ముత్తెమమ్మ రతనమమ్మ
,మరకతమమ్మ ఓయమ్మ ఏవూరమ్మ
మీది ఏదారమ్మ మీవూరు. రాత్రుల
చుక్కలు పొదిగేనా పగళ్ళు
ఎండలు మండేనా చెరువుల
కలువలు నిండేనా అరుగుల
పండితులుండేరా హరిదాసులు
తిరిగేరా చేలూ,గాలీ రాగాలు తీసేనా
పూలూ గాలీ ఎడదను తడిపేనా
వానా వల్లప్పా తొంగి చూచేనా
బంతులు,చేమంతులు
ఇంతులగూడి దిక్కుల రేనికి
చుక్కలబండి రాశేరా
ముగ్గుల ఒగ్గుల చద్దుల పల్లె
 కల కాదుకద నే బయలెల్లి రాగ
ఎండమావికాదుకద
ఎండినా నెర్రెలా,మండినా దారులా
రావలె సేద తీర్చునా మీపల్లె?
ఆదమరచీ సేద తీరేనా నా మనసు


మనిషికీ మనిషికీ,జాతికీ జాతికీ,నాగరీకతకీ నాగరీకతకీ మధ్య అంతరాలెందుకు?మతాలుకూడా మనుషుల్ని చీల్చడములో వాటి పాత్ర పోషించాయనే చెప్పాలి.నేను ఫలానా,నాకు ఫలానా,నేనిది చేశాను,నాదిది,ఇది ఇలాగేవుండాలి,నేకట్టినది,నా ముందున్నదికాబట్టి,నేముందు ఆక్రమించినది కాబట్టి,నే చూసినది కాబట్టి,'నాదీఅనే భావజాలానికి భహుశా లోతైన వేళ్ళేవుండివుంటాయి.బహుశా ఇవన్నీ  భయాలనించీ వుదయించి వుండచ్చు. తిండీ బట్టా నీడా కారణమైతే అందోళన పdaఖరలే,కాని అధికారమూ,అధీన జిగ్నాశా మూలాలైతే అవి సమాజ తిరోగమన సూచికలే అవుతాయి. Jiddu krishnamurti gaari lekhini nunDi.

No comments:

Post a Comment