hursday, 25 April 2013 at 04:52 UTC+05:
సంకెళ్ళు వేస్తుంది,కాలం దానికి తాళం వేస్తుంది.
నీ మనసులో ఏముంది? నీకు నువ్వే అధికారివనా?
అయితే నిన్ను నువ్వు శాసించుకోగలవా?
నువ్వూ, ప్రకృతీ ఒక్కటేనా?
అలోచనా ఆచరణా కూడా ఒక్కటేనా?
నీవు ఆకొన్నప్పుడూ దప్పికగొన్నప్పుడూ
నీకు బాధకలిగినప్పుడు,
నీవు చింతాసంకులితమైనప్పుడు
నీ స్మరణలోనే స్వాంతన పొందుతావా?
నీగురించి, నీకూర్చి, నీవలన, నీచేత
నీ కర్మ క్రీయల్లొ, నువ్వు జీవిస్తున్నావా?,
నీ చుట్టూ వున్న ప్రపంచంలో నీ పేరూ,
నీ రూపూ చిత్రితమైపోయయా? అల్లా అయితే
నిజంగా నువ్వు స్వంతంత్రానికి, నీ భవిష్యత్తు
రచించుకోడానికీ వ్యక్తు రాలివే.
నిక్షెపంగా ప్రపంచంలో ప్రవేసించు. నీ స్తానాన్ని,
నీయోగాన్ని వెతుక్కుని ప్రకటించుకో,
మేమప్పుడు దేవతలుగా వచ్చి అశీర్వదిస్తాము.
సరేనా, అయితే ఇంక ఆలస్యం వద్దు.
ఎందుకంటే, ఆలస్యం స్వతంత్రానికి
సంకెళ్ళు వేస్తుంది,కాలం దానికి తాళం వేస్తుంది.
No comments:
Post a Comment