Sunday, September 6, 2015

Wednesday, 22 May 2013 at 23:05 UTC+05:30

జీవము పాలుపోసుకు అణువు విత్తౌతుంది.





జీవము పాలుపోసుకు అణువు విత్తౌతుంది.
సూర్య గర్భ జనిత వుదజని వెలుగై
పుడమిని పోదిగి,బొగ్గు పులుసులో కందమూలమై,
జంతు జాలమై వనమై ప్రణవమై ప్రకృతౌతోంది.
తేజస్సే ఓజస్సు,జీవమే ప్రాణము.
కాని ఆకృతులు కృతి చేసిందెవరు?
జీవాన్ని శృతి చేసిందెవరు?
ఆశా పిపాశలు,అన్నిటికీ సహజమే,ఐయినా
బతుకు నిడివి చావు కొలతా
రుకి వేరు,మొదలుకి మొదలు.
వూహకందనిది అనంతమేమీకాదు.
చిన్నవాటికి చిన్న వూహ చిన్న చావు.
కొండకి కొండంత బతుకు అంతే చావు.
నిమ్మల బావికోసం కమ్మల గొడుగుతో
ఆరంభమైన ఆన్వెషణ ఒడిదుడుకుల పడవలో,
సుడిగాలులు నడిసముద్రాలూ దాటుకు,
తనని తనే తినుకుంటూ,గమ్యాలు దాటుకుంటూ
అసంగతులని సంగమిస్తూ,సిశు దశ మళ్ళి,
చెలియలికట్ట దాటి పట్నమై,నగరమై
నవీనమై,అన్వేకంలోంచి ఏకమై,
స్వార్ధమై ప్రకృతి మరచి దౌష్టమై,
చిద్ర చిత్రంగా మారిపోయింది.
భూమాతపై అదుగుజాడలు
మంచు యుగమ్నుంచి నేటిదాకా ముద్రితమై,
వారసత్వపు గుట్టు విప్పడానికి ఎదురు చూస్తూనే వున్నాయి,
ఓ మనిషీ, మమ్ము చూసి జన్మ రహస్యం తెలుసుకో,
అని ఘొషిల్లుతూనే వున్నాయి.
మేలుకుని ప్రకృతిని మన్నిద్దామా,
లెక విస్ఫొటక నాగరీకతలో నసించి పోతామా ఏమో,
చదువుకీ సన్స్కారానికీ వదిలివెయ్యల్సిన ప్రశ్నే.!!

No comments:

Post a Comment