Sunday, September 6, 2015


మా ఇంటిపేరు మరింగంటి




మా ఇంటిపేరు మరింగంటి చేసిన చెన్నయ్యావారూ,
వాసిన గట్టి వార్చిన జ్ఞానన్ని కాసింతయినా
మా జన్యువుల్లో తీర్థంగా వుంచారా?
మేమేమో ప్రపంచంలో వెదికేది
మీరెన్నడూ కలలో వివరించనిదీ
చెప్పుకోడానికి కనిపించనిదీ
కాలానికి, పరీక్షకి నిలవనిదీ
ఇక ఒక్కసారీ కనమే ఘనమైన
మరింగంటి అని సమ్మానం పొందిన
అమలిన రఘునందన పాదప రెణువు
అపర భగవద్రామానుజ ప్రభ
శ్రీవైష్ణవవినయ విపంచక శోభ.
కటిక కసాయి నవాబులకు
చిటిక గోసాయి తీర్థమిచ్చి
అక్కన్న మాదన్నలకు ప్రవర
గురువర్యులైన అపర
క్తి జ్ఞాన ధురీణ శేషావతార
పణక రాజ చెన్నయాచార్య
ధీమణీ మిమ్ము కనలేని మాకు
మరింగంటి యని ఇంటి పేరేల?
చింతన యందు,స్వాంతనగ
సంతసమున సమ్ముఖముగ
మిమ్ము తలచి తరించ
శ్రీరంగ విభుని భవ్య స్మరణమును
వేనోళ్ళ పలుకగ మమ్ము
దీవింపవే చెన్నయ స్వామీ.

No comments:

Post a Comment