ఎంతైనా నా శరీరమేకదా అది.
మనసా నువ్వు వెర్రివి. నాతోడిదే నీకిక గమనము
,మనమిప్పుడు పంచభూతాలకతీతమైనాము.
నీకోరికల వుచ్చులో నన్ను కూర్చకు.
ఇప్పుడైనా వాక్కాయాలకన్నా మనము భిన్నమనీ,
తెగిన తిత్తి మనదికాదనీ,గ్రహించవేమి?
ది అపరకర్మలకాలవాలము.
మనమేమీ తినేదీ తరించేదీ లేదుకాని
బుద్ధికి పని చెప్పి, ఇహ-పరధ్యాస విడువు.
అయ్యో,అయ్యయ్యో, అనుభవించనివీ,
ఆరాధించాల్సినవీ అట్టే మిగిలినాయి కదా!
వెలి వాకిలి దగ్గర బలి హారం స్వీకరిస్తా.
మల్లీ బతికి పరమ పుణ్య ప్రక్రియ చేపడతా!
ఓ 'ఆత్మా' తోడుండు. నన్నోదార్చు,
ఓ దారి చూపి ఆవాసానికి రా.
ఇప్పుడే కైవల్యమంటే,వైతరణీ,
విరజా నదీ దాటించే ఓపిక నాకులేదు.
నీవా కదల లేవు,చిన్న వెలుగువి.
తలచినకొద్దీ పలచనైపోతావు.
అదుగో భూ భేతాళాలెంత సుందరమో.
నావాళ్ళ గర్భావాసాల్లో చోటుండేమో.
పిఛ్చి మనసా! నీ పుణ్యమంత గణ్యమా?
మళ్ళీ అవేఅనుభవాలు పొందడానికి?
నీ తొందరలొ తిరొన్ముఖమయ్యావొ
ఏకుహరంలోనో దూరి ధుఖిస్తావ్.
మళ్ళీ జననము మరణమున్నూ,
ఒర్చుకోలెవుసుమా, అవసరమా!
ఇంకా బొందపై తొందర,ఆనక
నేనేమీ చెయ్యాలేను చెప్పాలేను
సరే, ఈఒక్కసారి మళ్ళీ పుడతా,
మంచే చేసి వైతరిణి దాటేస్తా.
వ్వు చూస్తూండు,విరజానదివైపు.
No comments:
Post a Comment