Saturday, September 5, 2015

Wednesday, 17 April 2013 at 14:45 UTC+05:30



క్రోధమెంత చెడ్డది? వివక్షే లేదు దానికి.
ఆవరించిందా అడాసియస్ అయినా
ఓడిపోవలసిందే. కాని చప్పున చల్లారిపోతే
కొంపలంటుకోవు,కాని దేదీ జరిగిపోదు,
ఔనా? అందుకని కోపమా కొంచం తాళు!
నిజంగా నీవాళ్ళకోసం, నీకోసం ఏడిచేవాళ్ళ కోసం.
అవసరానికి కోపపడు, కాని విసిరి కోట్టకు,
మనసు వ్రయ్యలైతే,మరి, చిరునవ్వులతో
అతకలేవు, అవస్త పడతావు,వగచి,
వేసారి, కోలుకోలెవు,ఏ గుండెలకో
తగిలితే,ఆగిన చప్పుడు వినపడదు
. కనపడని మనసు కలలలోకి జారేను
. ఇక నిద్దుర రాని బతుకు, నిలువునా
నిన్ను దహిస్తుంది. అహా క్రొధమా
నాకు అరణ్య రోదనమే శరణ్యమైనదిగదా'
అని విలపించే బదులు మెలుకో
మనసా మెలుకో,క్రోధ భాషలొద్దు.

No comments:

Post a Comment