Tiruvengalan Swaamin and Msr Anand Acharyulu are now friends.
Tiruvengalan Swaamin updated his status.
.
Tiruvengalan Swaamin updated his status.
విడువుడరి వస్తుసంగమ
విడువుడరి వస్తుసంగమ విడిచిన
పిమ్మటను మీరు విశ్వాత్మకులమున్
విడిది యగు వానియందే వీదువుడి
మీయాత్మలెల్ల విడివడని వడిన్
:
ఎన్నగ జీవాత్మలు కడు,
మన్నించు శరీరసమితి మనుగడలన్నన్
మిన్నున మొరసెడు మెరుపుల
కన్నను క్షణికంబులనుచు గాంచుడి.
మీరలు మీయది యనునది
వేఱుమొదలు నూడబెరికివిశ్వేశ్వరునిన్
జేరుడి ఆత్మలకంతకు మీరిన
యాధిల్యమేది? మేలొడ గూర్చున్
చిదచిత్తులకున్ బరుడయి సదా
ముదము బొదలునట్టి సర్వేవ్సశుని రూ
పెదనిల్పి యాశ్రయింపుడు వదలుడు
వ్యర్ధంబులైన పరవిషయములన్
ప్రకృతి విడిపోయెన నాత్మకు మోక్షము
కూడునైన దానన్ దను పొన్ దక
ఇంకవలచితేఏనియు సకలాన్యము
విడిచి కొలువు సర్వేశ్వరునిన్
ఏ యోగాన్ని సాధించడానికైనా మునుముందుగా యోగ్యత అనేది మనకి మనము సాధించాలి. దానికి పెద్దలు వారి ఆధ్యాత్మిక ప్రయాణములొ పొందిన అనుభవాలు, ఆచరణలో అంకాలూ మనకి ప్రసన్న కలితార్ధముగా ప్రసాదించారు. వాటినే సాధనా సంపత్తి అని మనము అంటాము. అన్నిటికి మనసును స్వాధీన పరుచుకోవడము మొదటి మెట్టు. మనసంటే,మనకి ఎన్ని అనుభవాలో దానితోటి. దాన్ని అనుభవిస్తాము లోలోనే. శిశువు ఏడ్పూ,పశువు ఆక్రందనా,పక్షుల కువకువకువలూ,కస్టాల కడలిలో,మనకి కలిగే స్పృహా నిస్పృహా సంతోషములో మనమనుభవించే నవ్వుల హేలా,బాధలని చూసినవెంటనే కలిగే ఆదుకోవాలనే జాలీ దయా ఇవన్నీ మనసు లాలిత్యాన్ని చెప్పెవే.అయితే కావాలనే కోరికా,అనుభవించాలనే తృష్ణా, సొంతము చేసుకోవాలనుకునే పేరాశా ఇవికూడా మనో స్పందనలే. పొందినవాటివల్ల ధుఖమూ, ఆవేదనా,అవస్తలూ,ఇవన్నీ మనసు లక్షణాలే. మనసుని ముందు సంభాళించుకోవాలి. దానికి మార్గాలు పాసురాన్వయములొ విపులీకరించ బడినాయి. వీటిని ఒక్కటిక్కటిగా అర్ధము చేసుకుందాము.
.
వినయసీల వినుత పావని వినత
సుధగ్రొలి అమరమై వసుధ నాగ
నాకమౌదలచేబూనిన పన్నాగ మతి
కధ్రువగాంచె గతి చెడ్డనాగుల ధ్రుతి
No comments:
Post a Comment