Tiruvengalan Swaamin updated his status.
రా మానుజమౌని సూక్తి మహిమంబు
స్వానుభవాఢ్యులౌ ఋషుల సత్యవచస్సుశృతిప్రమాణ ని
ర్మాణ ధృఢంబుజేసి పెర మాయవివాదముదర్కవాద ఝం
ఝా నిల ధూతమౌనటు,వెలార్చి ప్రపంచహితంబు జేయు
రా మానుజమౌని సూక్తి మహిమంబు శరణ్యము వైష్ణవాళికిన్.
పెద్దవాళ్ళు అంటే,మన ఋషులు,త్యాగాది ఆద్య గుణాలతో లోక ప్రశశ్తమైనవాళ్ళు. మనిషి గా సభ్యమానవ సమాజములో జీవించే సరళిని ఒకరివెంట ఒకరు,ఒకరుచెప్పినది తరువాతి తరము వారు శోధిస్తూ,సవరిస్తూ, దెశ కాల పాత్రతలని సమర్ధవంతముగా అన్వయిస్తూ స్తిరీకృతం చేసినవే పెద్దవాళ్ళ మాటలు. సూక్ష్మముగా అవే శృతులూ,శ్మృతులూ,న్యాయాలూ,పురాణ దార్శనిక గ్రధాలలో నిక్షిప్తమై వున్న క్రియా,కర్మ,కరణ,కారణాది విషయాలు. ఇవి,కధా రూపములోనూ, ప్రస్నొత్తర రూపల్లోనూ వుపదేస విధముగానూ మనకి లభిస్తాయి. వీటి ఆచరాణాబద్ధతే ఒక జీవన విధానమౌతుంది. సరళమై,దీపకమై,శాంత ప్రచోదితమైన జీవన విధానాలు,సమాజానికి సమ్మతమై మతము గా పరిణమిస్తాయి. ధార్మిక మార్గముగా పిలవబడేదే మతమ్ము. సమాజాన్ని మొత్తంగా అంతవాహినియై జన్మ మరణాది పర్యంతమూ చుట్టివుంటుంది.సంసారాన్ని,సంతానాన్ని,సత్ప్రవర్తనని,సద్యోభోగాన్ని,వినయాన్ని,సర్వులయందు,సమ,దైవద్యుతినీ,పరమ పవిత్ర భగవదారాధనగా నిర్మించినదే శ్రీవైష్ణవ సిద్దాంతము.ఇది మతమూ,మంత్రమూ,మోక్షమూను. శటగోపస్వామి మన సమస్తాన్ని వినయ శరణ్యమయము చేశేశారు.అట్టి వారికి మ్రొక్కి గురు పరంపరని స్మరించుకుందాము. నల్లాంచక్రవర్తుల రాఘవాచార్యులు మామగారికి దాసుడి నిత్య ప్రణుతితో.
No comments:
Post a Comment