Tiruvengalan Swaamin updated his status.
వెనక్కి నడుస్తున్నాను చెదరిన
నా అడుగుల జాడలు చేత్తొ
తడుముకుంటూ,మనస్సు లోతుల్లో
కూరుకుపోయిన సంగతుల్లో కాలు
జారిన అడుఘులు, విబ్రమములో,
దారి తప్పిన అడుగులు, గుడి చుట్టూ
నడచిన అడుగులు మడి తప్పిన చెడు
అడుగులు,తప్పటడుగులు,
నిద్రలో నడచిన,బురదలో జారిన అడుగులు
, మనోక్ళైబ్యంలో,వంటిమైకంలో తూలిన అడుగులు,
పద పల్లవములకు కుంకుమలదిమినప్పటి,
చిటికెన వేల్పట్టుకు నడపించిన అడుగులు
, శైశవ దశలో అడుగులెక్కడ: మడుగులొత్తిన
మాత స్పర్సామృత నిద్రాముద్రలు దక్క
ఆ గుర్తుకువచ్చె,నేనాదశలో రెక్కల రాయంచని,
కన్ను మాగితే,మిన్నట వాహ్యాళి సత్య కృత్యమే.
ఆ అరుణారుణస్వేతాంబర వీధుల్లో అడుగుల
చడిఎక్కడ,పరిమళాఘ్రాణమే పయనచోదకము.
అంతకుముండు,నిద్రలో:గుర్తుకు వస్తోంది,.
మెలకువలోకి ప్రవహిస్తూ విస్మృతమైపోతుందా తలపు.
పులకరింతల కావల అవశేషాల గుర్తులు.
కలయతిరుగుతూనేవుంటాయి,
వాటికీ వాసనలు, అప్పుడు చిద్రాన్వేషణా
క్షుద్ర ముద్రలూ, వెనెవెంటనే నేభరించలేని
వుత్పతనము, నిద్రలో మెలకువదారి,
మరచి,సగంచచ్చి. అన్ని వర్గాలనీ కోల్పోయి
అంగలారుస్తూ, మల్లీ అడుగులేసే అద్ర్స్టంకోసం
సుడివుంటే, మెల్కొంటూనే వుంటా,కానీ మృతభయం|
"అడుగు తడబడి విహ్వలమైపోతానప్పుడు".
No comments:
Post a Comment