Tiruvengalan Swaamin updated his status.
నాన్న మీరు పోయారు.,\
మధ్యలో చాలా మారిపోయారు.
చీకటంటె మీకు భయం లేదు.
తోటపల్లి కొండల్లొ,శరభవరం దారుల్లో
అయ్యవార్లు వున్నారంటే అందరికీ ధైర్యమె
చెప్పుల్లెని కాళ్ళూ,కర్ర సాయం లేని మనిషి
నీడవాటారుతున్నా నిర్భయంగా నడచె స్వామి
నోత్లో మాత్రం రాగమో,పద్యమో,పాసురమో నలుగుతూ,
నలుగురూ వెనక పడిపోయినా ఆయన
గొంతులో అలాపన ఎంత ధైర్యాన్నిచ్చెదొ
ఆయాన పద్యాలూ, ప్రార్ధనలూ
,సాయంకాలాలు పెద్దముచ్చటే,
శాంతాశ్రమము ఆసాంతమూ నిశ్శబ్దమైపోయెది.
పగలంటె నగలంటె, నల్గిన మీమనసుకు భయం
రోజులు గడవడానికి అమ్మ ఏడువారాలూ
ఇచ్చేసిందిగా, లెక్కకి తగ్గిన తెలివితో,
ఎక్కువ నెగ్గని మనసుతో,
మక్కువ చాలని మనిషితో,
తక్కువ తేలని ఖర్చుతో,
నిరంతరమూ,నిలబడేవున్నారు.
నిలబెట్టిన ప్రస్నలు,
నేలపడేసి జవాబు చెప్పయి.
యేటిమధ్య వ్యవసాయం
నీటిమూట ఫలసాయం
అదీ వీరవాసరంలో, గరువులో
భూమి యెరువిచ్చినవాడెత్తుకెళ్ళాడు
. తిన్నది,వున్నది,అన్నది,విన్నది
మా నాన్నది కరిమింగిన వెలగపండు.
నాన్నా యెన్ని ముచ్చట్లు చెప్పేవారు.
వున్నట్లే వుండి మాయమైపోయే వారు.
పోడుగైన మీ రాక కోసం మెము
తొమ్మండుగురమూ,వళ్ళంతా కళ్ళై
వీధి కిటికి దగ్గరే కాపుకాసే వాళ్ళము.
బావురు మనే ఇంత్లో,పసి హృదయాలు
చూరు జారిన వంత ఇంటిలో నిజంగా
నల్ల పిల్లి పడుకునే వుండేది అమ్మ
తరిమినా మళ్ళీ మళ్ళీ అక్కడే తిష్ట వేసేది.
కవి కావలంతే మాఇంట పంటే. బయటకు
రావాలంటే, బలమైన కారణాలుండేవి కావు
ఎదురు చూపులూ,వుత్కంఠతా సందు
మొగలో,చిట్టెయ్య చిల్లరకొట్టు. దిగువకు
గొపయ్య కిరాణాకొట్టూ, ఎటుపోవాలన్నా
చూపుల చురకత్తులు.
సంతానమెక్కువా,సంపాదన తక్కువా,
జాలో ఎగతాళో, ఆకలి అల్లరిలో,
అవమానము మాత్రము అవును,
అందుకే ఇంత్లోనే అక్క దంద కట్టికధలు
చెప్పి,కాయోకసవోబతిమాలితినిపించేది
. ఔను అక్కంటే రాజ్యలక్ష్మే,
. అక్కకి మెమే పిల్లలము
,అమ్మ ఏదోధ్యాసలో వుండేది,
నీరసంగా పడుకునేది పొత్తికాళ్ళమన్మీద.
మెము అంతే తమ్ముళ్ళూ,చెల్లెళ్ళూ,
మానీరసించినకళ్ళూ అక్కకి
ఎంత దాచుకున్నా కళ్ళల్లొ ఆగని కన్నీళ్ళూ,
అప్పుడప్పుడు,నీడలు పారాడే వేళ,
నాన్న వచ్చెవారు,అమృతము తెచ్చెవారు.
చైతన్యమూ,సంతోషమూ గుబాళించేవి.
బలహీనమో,సమహారమో, దారిద్రియపు
నవ రసాలూ, జీవితపు తొలి అంచుల్లొ
,తొట్రిల్లాయి. తిలకు తిని రాశాడో,
శ్రీశ్రీ త్రాగి అల్లడో,కవితా సుమ పరిమళాలు,
కధా చమకృతీ పెద్దక్క సొత్తైంది.
బూక్కులు,రుక్కులు,పబ్లీకుగా లయిబ్రరీ నుండి
ప్రైవేటుగా ఇంట్లోంచీ తిరగమోతలైనాయి\
అక్క అన్నం పెట్టిందటే కధొ,కవనమో
నంచు వుండాల్సిందే. చందూరు చదువులూ,
ఝరుక్ శాస్త్రి రుక్కులూ, చెలరేగిన చలంగారి
మంపీ విష కన్యలూ, కుతుంబం చెప్పిన చదువు,
ధర్మారఒ మురమరాలూ ప్రజామతా,
అప్పుడప్పుడు ఇలస్ట్రేటెడు వీక్లీ ఇవి
పెద్దక్కకి భోజ్యాలు మాకు అన్నంలొ నంజుడులు
. పెద్దక్క చుట్టిన రక్ష రెఖ మా బతుకులకి స్రీ రామ రక్షే.
గతించిపోయిన సొత్తుళ్ళొ, నాన్న, అమ్మా
అక్కా ఒకా తమ్ముదూ,ఎక సంతాగ్రాహి అక్కచెప్పిన
వూసులూ, పద్యాలూ,ఎంతకతలామలకము వాడికి
మంగత్తగారి రామభడ్రుడె ముచ్చటపడ్డాడు
,దొడ్డం మామ తెగ మెచ్చుకునేవారు,
మాటల్లోముక్కొస్తుందని గోపాలూ రామదత్తూ
వగైరా వెక్కించినా పద్యాల్లొ, మాటల్లొvaaDikivaaDE saaTi
నాచేతిలో గతించిపోయి ఎంతకాలమో
ఇంటిని చీకట్లోముంచిదేముడి దగ్గరకే వెళ్ళాడు.
No comments:
Post a Comment