మా ఇంట్లో పెళ్ళో పేరంటమో తెలీదు కాని కల్లో,
తరలి వచ్చేశారు తరతరాల, పెద్దలందరూ,
ఆనంద వదనార విందాలతో ఎవరెవరో
వివరం తెలీని పిల్లలు మందార మల్లె మాలలతో
చందన కర్పూర రస గంధలతో మంగల
హారతులతో,శ్రావ్య గీతాలతో స్వాగతించారు
,పోలికలు వెతుక్కుంటున్నారు.
నాన్నా నీకేమైనా తెలుసా వారెవరెవరో?
ఇంటికి పెద్దమ్మాయి మాఇంటికి దీపం
అందరికీ అయిన సందేహాన్ని తీర్చింది.
ఇదుగోనర్రా వినండి, ఆపొడుగాటి ఆవిడ
భిరాట్టమ్మ గారు మా చిన్న నాయినమ్మ గారు
ఈ కొటెరు ముక్కు చందమామ తెలుపు
ఆవిద మా నాయనమ్మ గారు నాంచారమ్మ గారు.
మందపాటి నామాలాయన మాతాత గున్నయ్యగారు
గంభీర మూర్తి ఆరిందా ఆవిడ అంగల్లు గారు,
మా పెద్దత్త గారుఅందమైన చిరునవ్వుల తల్లి
ఆ ప్రక్క మా మంగత్త గారుతుని వరు
కొంచం పక్కన తూపురాణి వారు
మా సుభద్ర అత్త గారు,అమలాపురం
వారి వరుసలో తాడిన్నర వున్న వాడు
మా పెద్ద అయ్య్నగారు బావ అయన
బావల్లొ పెద్ద బావ,ఆప్రక్కన వారి వారి
తమ్ములూ, చెళ్ళెంద్రు, అందరి పెర్లూ
నాకూ తెలీదు. ఇంకా చాలామంది వున్నారు,
మరి పనులున్నాయి గా మళ్ళీ మాట్లాడు
కుందాము, మంచిగా తెలుసుకుందాము.
No comments:
Post a Comment