Saturday, September 5, 2015

పగలు మెలకువ భయపెడుతోంది
కలల భయంతో నిద్రే కరువాయె.
మెలకువ లో నోరు నాలికా వాటిష్టం
నేభయపడుతూనే వుంటా, కాని మాటలేనా అవి?
మనసులని తూట్లు పొడిచే వ్యంగ్యాలు.
నా నాలిక పాడుకాను, ఏమి తొందర దీనికి?
కవిత్వాలతో తల నొప్పి వినే వాళ్ళక్కాదు.
మొదట నాకే చిర్రెత్తుకొస్తుంది.
యమక, గమక,శ్లేష,వ్యంగ్య విడంగాదులు
వెధవది వినే చెవులూ అలాంటివే,
ఏదివినక్కరలేదో వాటికి బాగా తెలుసు.
అయితేనెం 'కానిపని' చేసె వుత్సాహం దొడ్డది.
బుద్ధి దాని ముందు దిగదుడుపే మరి.
నిద్రలో ఏంచూస్తానో నాకెన్నడూ తెలీదు.
ఎంత నిజమైన కలలవి! మాటలూ
అభిప్రాయాలూ,కోపాలూ,తాపాలూ,
సీ కార్పణ్యలూ. నేనేం చెయ్యాలో
ఏటునడవాలో చెప్పే మనసు కూడా వున్నా,
నాదారేదొ ఎప్పుడూ నాకు తెలీదు.
గతం కనిపిస్తుంది, వర్తమానమౌతుంది.
చుట్టాలూ,మిత్రులూ,అమ్మా నాన్న
వాళ్ళతోబాటు కదిలే నీడలూను
పాత గుర్తులూ,కొత్త కధలూ,
నిజం అనిపించి సంతోషమూ,ధుఖమూ
ముప్పిరికొంటాయి. అయినా
అపురూపమైన కలలు అరుదు. నిజానికి
భయపడి మెలకువ తెచ్చే కలలే ఎక్కువ.

No comments:

Post a Comment