Saturday, September 5, 2015

నిన్న పుట్టిన పిల్ల విప్పారిన నేత్రాలతో చుట్టూ చూస్తోంది
వేలు నోట పెట్టే పనిలో ప్రపంచాన్ని బొటకన వ్రేలితో తడిమి చూస్తోంది.
మాతృహృదయం ఆకొందేమో తల్లి అని ఎదకెత్తుకొంది
. చిచ్చి కొడుతున్న అమ్మ చేయ్యీ,గుటకల చిటికెలూ
,దోబూచులాడే చందమామని నవ్వించాయి.
ఎంత ప్రశాంతమైన నగవు పాప పెదవులపై? కన్నా క్రిష్ణా
,చిరునవ్వుల్లొ దాగొన్నావా శిశువుల పశితనమే నువ్వా
, అని నివ్వెర పోదూ అమ్మ? మఱ్రి ఆకుమీద ఆద మరచి
నిదురించిన స్వామీ అందరమ్మలకీ
ముద్దుల మురిపెంపు చిరునగవువేగా.
అమ్మలార ఎన్నిజన్మల పుణ్యము
మీది,నిత్య సుభ మంగళము మీకు.

No comments:

Post a Comment