3:29 "తేనియ చిలుకు తెలుగు పలుకు
వేనువులూదు మోహన రాగము
తూరుపు హిందోళము
వెరసి రాశికి మానిని మత్తేభము
సరస కందమునందము
కృత యుగమ్మున సంస్కృతంబది
పాడియై శృతుల స్మృతుల కతల
వెతల పాటల మృతవీరుల
అమృత గాధల దృతంబు
మీదనచ్చుకు నెచ్చలియై
ఖఠిన శిలా నాసిక నల్ల నెల్ల
జాలువారి వారాసియై
పాపములడంచు గోదారియై,
కానకొనల పచ్చదనంపు పల్లె
పదములై నన్నయ గంటంబున అమృతమై,
తిక్కన ప్రక్కన పెన్నగ చిన్నగ నగుచు
నాట్యమాడుచు నిర్మలమై"తెనుగై"నది.
భక్తికి శృంగారముల రంగు చీరలుగట్టి
బొమ్మెర వద్ద బొమ్మల కొలువై
కాకతీయగడ్డ కాషాయ రోషపు నెరసుల
పాటల మాటల మూటైన వెలుగు తెలుగు.
కోటి వీణల రాణి పాట పాడినది,
మేటి తేటగీతల సాటి ఆటవెలదుల
రాటుదేలిన కోమటిబిడ్డ భక్తి గానముల
చాటువై,ద్విపదయై మానవీయై
మానినియై సిద్ధవటమున బుద్ది
సారమై పొతులూరి వీరబ్రహ్మ
వాచక కాల జ్గ్నానమై మొల్ల తల్లి
రామాయణమై పెద్దన కవికూటమి
మద్దెన కవనమై రాయన సరసన
జిగియై బిగియై యెర్రన మందారమై
ఒగ్గిపాటై చద్దిమూటలై వెల్గొందినది
తెలుగు తూరుపు రేక నాభాష.
ఇచ్చా రహిత మోక్ష ప్రదాత
నాభాష లజ్జ విడిచిన ఇజాతి
అషాడభూతులనొట బూతై,రాతై,
వెతయై గోడల గుడుల జాడల
అంగాంగములందు అన్యాసక్తయై
మసి రాతయై రసి సిక్తమై జాంతవయై
స్వాంతనకై యెలుగెత్తి ఏడ్చుచున్నది
కసాయిదర్పదృష్టయై శల్యావసిస్ట
గాక మున్నె ఇచ్చపూర్వక నిష్టతో
కర్పూర హారతులిద్దుముగాక."
No comments:
Post a Comment