forefathers raised them, it’s we who must protect them. -- Old Chipko Song (Garhwali language)[16] ”
చీకటి వెలుగుల చుట్టూ నిద్రా ముద్ర,
మెలకువ స్పృహ నిద్రలోకి నిదానంగా జారి
వళ్ళు విరుచుకు కళ్ళు తెరుస్తుంది
శిలా సద్రుశమైనా, చిగురుటాకైనా చపలమైనా,
పాషాణమైనా మనసంటూ ఒకటుంటుంది.
కోపానికి వూగినా, తాపానికి కందినా
మంచికి,శాంతానికి,మానవత్వానికి కరిగి
నీరై కమనీయ నీహార మౌతుంది.
కలలొ సంకల్ప వికల్పలు వెన్నంటిజీవి
దూరాలు గమిస్తుంది,భారరహితమౌతుంది.
కసి కార్పణ్యాలు,రాగ ద్వేషాలూ ప్రసన్నతా
పసితనమూ,అరిషడ్వర్గాలూ కలగా పులగమై
మనో భ్రమల కద్దంపడతాయి.మెలకువలో
కల్లొల వుల్లాసాల ద్వయీ మనస్క జీవి,
వేదనలో జీవిత గమ్యం అగమ్యమే
. క్షణం పట్టదు కోపంతో రగిలిపోవడానికి.
దశ మారే దశలో వుసురూ వూడిపోవచ్చు.
ఎవరి చావుకు ఎవరూ కర్తా కారణమూ కారు.
ఎవరి గొయ్యి వారే తెలిసొ తెలియకో
మెలుకువలోనో నిద్రలోనో తవ్వుకుంటూనే వుంటారు
. కాని, మెలకువలో నిద్రిస్తే, తెలిసీ క్రొధంతొ చరిస్తే
కామంతో తరిస్తే,మోహంతో వ్యవహరిస్తే,
మద మాత్సర్యాలు తోడైతే
ఇంగితం రగిలేలోగా సంగతులాగిపోతాయి.
వశం తప్పిన వంశంలో శవమై
కలా మెలుకువా ఇలలో ఒక్కటై
జీవ సర్పిలంలో గిరికీలు తిరిగి
అస్తమయంలోకి వాస్తవమేదో
తెలుసుకునే ప్రయత్నంలో ఆత్మ
మళ్ళీ ఆవాసము వెతుక్కుంటుండి.
No comments:
Post a Comment