Saturday, September 5, 2015

Sunday, 21 April 2013 at 00:45 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.



లక్ష్మీ నరసిమ్హ బ్రోవర వరద యని నీ దయ కోర
క్రూర కర్మ(లు)ప్తమౌ అక్రూర ప్రియ కృష్ణ గోవింద,
దామోదర నా హృద్య గద్య వచో శొకము ప్రిక్కటిలి
ఘోషింప ఒక్క టొక్కటిగ లంపటములు ప్రిదిలి రాలి
నీ మ్రోల భవత్కృపాశేష శరీరము సాగిలి మ్రొక్క జాలగ
ఘన ఔదార్యము జూపుమఘన నగధర వసుంధరాధర!
నీయందు నీమ్రోల రంగ నాయంతరంగ తరంగ ఘోష రంగ
స్తబ్దమయి నిశ్శబ్ధమై నా జవజీవమ్ములు లుప్తమయి
సుమసమములు గ చేసి నిన్నుసేవింప కృపచేయవే
జటిలమైన కుటిల సంసార సుఖసార వాసనా వాంచితమ్ములు
మిగుల తగిలి చార చోర ఘోరాపచార విచార మగ్నమైన
మనమును మునుమున్నె భక్తిసార సంద్రమ్మున్
ముంచవే ఈశ్వర దయాంచిత కృపాకటాక్ష ధురీణీ

No comments:

Post a Comment