Friday, September 4, 2015

Saturday, 9 March 2013 at 10:55 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
అహం అంటే నేను లోపల- వరకూ, వైతరణి నుండి విరజానది దరీ తెన్నూ కానరాదే? ద్వైతమైన దృగ్శ్రవణఘ్రాణాదులు. ఏకాంక కర్మేంద్రియాలూ నాలో ప్రవాహికా చూర్ణికలూ,కర్ణికలూ కదలాడె తంతువులూ,పాయువులూ. కదలక మెదిలే వూహలూ,కరచరణాల విన్యాసాలూ,కనరాని కర్తృత్వపు శృతిలయలూ ప్రకృతిలో శ్వీకృతిపొందిన మరోప్రపంచము, సుషుప్తిలో నా అంతరంగము అనంతమైపోతుంది. అశరీరీ,అనంతాలనే స్పృసించాలని ఆశలో చీకట్లోకో స్తబ్దత్వంలోకో, ఎగరలేని దాటరాని వుచ్చుల్లొకో, ఎక్కిన రైలుదిగి తొక్కక్కరలేని మరపుల తీగలు మట్టీ లోచీకటిలో కూరుకు పోతుంది,జారి అదేదారి మళ్ళీ తప్పుతుంది. నేనప్పుడెప్పుడో,ఇంకా నేను కాదు. అప్పుడు ఈ ప్రపంచాన్ని పరికించాను. కైలాస గిరినుండి ధనుష్కోటి దాకా, పుర గోపురాలూ,జలజాత భవ పుష్కరిణీ, తీర్థ నదీనద శీర్నమేఖలా మేదినీవలయమూ, అస్వమేధ,నరమేధ,యవన,హవన,హనన, మరణఘట్టాలూ,మహా స్మశానాలూ, కాలవశాన కవోష్ణ ధారలలో కరగిన మహా రాజ్యాలూ,మరణ శాసనాలూ, నీలి నీడల గాలి గోపురాలూ, వీరులూ,చోరులూ,పద చారులూ, అంగుళీమాల,అనంగపాల కదనకేళీ చోళ,ఆంధ్ర, వుత్కళ చేర,పాండ్య, స్వేత దిగంబర,భూతపైగంబరాది, నానాజనగణ విశేషాలూ చూసిమొహితనయ్యాను. వారి వారి పద ఘఠ్ట్టనలూ, అహంకారపు ఝంకారాలూ, వర్ణ వివర్ణ సచ్చిద్రాలూ, నిద్రా ముద్ర సిల్పాలూ, తప్పుకుంటూ పోతే,సాలభంజికలూ, మరో మహెంజాదారోలూ, నైమిశారణ్యము నుంది,తమసానది దాకా ఎన్ని చిత్ర విచిత్రాలు? విరబోసుకున్న చీకట్లు వేల కోట్ల కళ్ళు నులుముకున్నా, చిట్లిన ఆకాశంలో,తళుకులీనే, మెరుపుల జీరలు,నన్నాశ పెత్తయి. బొందిలో ప్రాణం పోసుకోవాల్సిందే, ఆత్మకి నచ్చచెప్పి బొందిలో దూరాను.

No comments:

Post a Comment