Friday, September 4, 2015

paapamu Saminchedaakaa opikapattandi

Saturday, 9 March 2013 at 08:43 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.

పాపం శమించేదాకా ఓపిక పట్టండి


మూల్యాంకనలో తొందరపాటు
మూలతత్వంలో మాలిన్యపు మరక
బొందని పట్టుకున్న ద్వంద స్వభావము
కంద మూలాల దుంప తెంచింది.
గంధ రాహిత్యములో కలవరపాటు
కాగితపు పూల జీవన జ్వాల.
వూపిరికి నిప్పంటుకుంది.,
చావు తెలివి తెల్లరింది.
తొందరగా నెత్తిమీద వుసిరి పెట్టండి
, పావన గంగా సలిలములు తెండి.,
తొందరదిప్పొడి గొంతు,గండరగండ
యమకింకరులు సందడిగా నులమకముందే.
తమ్ముళ్ళూ చెల్లెల్లూ ఆలు బిడ్డలూ,
గడ్డుకాలం దాపరించింది,గట్టెక్కించంది.
అయ్యో నాగొంతు నూతిలో వుంది.
చిలకకి తులసాకు కట్టి పంజరంలో దాచండి.
ఓ శరీరమా నేను ప్రాణాన్ని,
మీరలక్ష్యముచేస్తే మానంగుండా జారిపోతా.
మందగించాయిగా వుచ్చ్వాస నిశ్వాసాలు.
ఎక్కడో ఆలాపన నారాయణా.,
కొడుకా ఎక్కడరా,రాయిగా మారావురా?
రేయి తెల్లారు,వుసురు చల్లారు.
లక్షణంగా నాగొంతు పెగలదు,
క్షణాలు దక్షిణముగా కదిలిపోతున్నాయి.
వుత్తరంగా చాపని పరవండిరా.
ఇక బొందని అందలమెక్కించేయ్యండీ,
. దీపం చుట్టూ గిరికీలు కొడుతున్నా,
పాపం శమించేదాకా ఓపిక పట్టండి.
తలదీపములో చమురు విదపండిరా.
కొండెక్కిపోతే చీకట్లో కూరుకుపోతా.
ఇప్పుడు మీరేంచెయ్యాలో చెప్పలేను,
నాకెంకావాలో తెలిసీ ఏంలాభం?
వామదేవుల మంత్రాలు చండ్రనిప్పులతో
కామ,తీపర చెదలని తగలాడుతున్నయి.
రోదనలాపండి,మీరనే నేను,ఇక పూర్తిగా నాదే.
చావు నాదే అయినా,స్వర్గానికి నిచ్చెన, మీరే వెయ్యలి.!!

No comments:

Post a Comment