.నేను అవశేషాన్నే
నే నులక మంచమ్మీద సగం మెలకువ సగం నిద్రలో వున్నా
తలుపులు లేని తడికెల గది తలపులోలేని తడీస్పర్శ
గుండె చప్పుడుకు చెవులవిసి పోతున్నాయి
గంతల్లోంచి చూస్తే ఆకాశంలో చుక్కల్ని చెరిపేస్తోందామె
తడికెల చిల్లులు చీకటికి జల్లెడ పడుతున్నయి,
చిక్కిన చుక్కలు రెక్కలు కట్టుకు ఎగిరిపోతున్నాయి
.ఆమె ఇంకా ఆకాశానికి సిరా పూస్తోంది.
మెరుపుల హాసరేఖలు వూర్పుల వురుములు
వూడిన రెక్కల,రాలిన చుక్కల మధ్య
పెళ్ళలై పొయిన నులకమంచం అది నాస్వంతం,
దానిమీదే అరిషడ్వర్గాలని జయించాలని కలగన్నా,
గొంగలి చాటు నాచూపులు చుక్కలవెంట
కళ్ళతొ సహా తిరిగిపోతున్నయి గుండె చప్పుళ్ళు
వినబడవు,వెనకబడినట్టున్నాయి హమ్మయ్యా
ఇక చుక్కలు చూడవు నేనొస్తున్నానుండు,
అంటోదినిశీధిగళం ఖానీ నేను లేనుగా,
కాళ్ళూడిన మంచం పాడికి పనికొస్థుందిలె,
చిల్లుల గొంగలి వస్త్ర సంస్కారానికి సరిపొతుంది
అయినా పర్వాలేదు నేను అవశేషాన్నే
వెలుగులొ నువ్వు కరిగిపోయెదాకా నేతోడుంటా
No comments:
Post a Comment