Tiruvengalan Swaamin updated his status.
పాపం శమించేదాకా ఓపిక పట్టండి
మూల్యాంకనలో తొందరపాటు
మూలతత్వంలో మాలిన్యపు మరక
బొందని పట్టుకున్న ద్వంద స్వభావము
కంద మూలాల దుంప తెంచింది.
గంధ రాహిత్యములో కలవరపాటు
కాగితపు పూల జీవన జ్వాల
. వూపిరికి నిప్పంటుకుంది.,
చావు తెలివి తెల్లరింది.
తొందరగా నెత్తిమీద వుసిరి పెట్టండి,
పావన గంగా సలిలములు తెండి.,
తొందరదిప్పొడి గొంతు,గండరగండ
యమకింకరులు సందడిగా నులమకముందే
. తమ్ముళ్ళూ చెల్లెల్లూ ఆలు బిడ్డలూ,
గడ్డుకాలం దాపరించింది,గట్టెక్కించంది.
అయ్యో నాగొంతు నూతిలో వుంది.
చిలకకి తులసాకు కట్టి పంజరంలో దాచండి.
ఓ శరీరమా నేను ప్రాణాన్ని,
మీరలక్ష్యముచేస్తే మానంగుండా జారిపోతా.
మందగించాయిగా వుచ్చ్వాస నిశ్వాసాలు
. ఎక్కడో ఆలాపన నారాయణా.,
కొడుకా ఎక్కడరా,రాయిగా మారావురా?
రేయి తెల్లారు,వుసురు చల్లారు.
లక్షణంగా నాగొంతు పెగలదు
,క్షణాలు దక్షిణముగా కదిలిపోతున్నాయి.
వుత్తరంగా చాపని పరవండిరా.
ఇక బొందని అందలమెక్కించేయ్యండీ,
. దీపం చుట్టూ గిరికీలు కొడుతున్నా,
పాపం శమించేదాకా ఓపిక పట్టండి
. తలదీపములో చమురు విదపండిరా.
కొండెక్కిపోతే చీకట్లో కూరుకుపోతా.
ఇప్పుడు మీరేంచెయ్యాలో చెప్పలేను
, నాకెంకావాలో తెలిసీ ఏంలాభం?
వామదేవుల మంత్రాలు చండ్రనిప్పులతో
కామ,తీపర చెదలని తగలాడుతున్నయి.
రోదనలాపండి,మీదనే నేను,ఇక పూర్తిగానాదే.
చావు నాదే అయినా స్వర్గానికి నిచ్చెన, మీరే వెయ్యలి.!!
No comments:
Post a Comment