నాక్కోపమొచ్చింది. నామాట గాలి వింటంలేదనీ.
ఎంత వూదినా నిప్పు రాజుకోవట్లేదనీ.కర్రలు,
పెళుసైనా పొగే వస్తోందనీ. నాకు నిజంగా
కోపమొచ్చింది. రోడ్డు మీద కార్ల హారన్లు
చెవులకి తూట్లు పొడుస్తున్నాయని
పేవుమెంటు మీద నడిచే దారిలేదనీ
పడిపోతే పట్టించుకునేవాళ్ళు లేరనీ.
నాకు కోపం రాదామరి, కొన్న కొబ్బరి
కుళ్ళితే, సరకు తూకం తగ్గితే,
పాలుకల్తీవని తెలిస్తే? నాకు చాలా
విషయాలు కోపం తెస్తున్నాయి.
పెట్రొలు పంపు వాడు సొంత పన్నేస్తున్నాడు.
అది బాంకువాడి సస్పెన్సులొవుంటుందిట,
రైల్లొ నల్లకోటాయిన టిక్కట్లాయినా
అరదండాలేసే ఆయనా అణాకాణీలకి
కక్కూర్తి పడినప్పుడు,యూనివర్సిటీ వాడు
బాహాటంగా డబ్బులు దోబ్బెసినప్పుడూ,
కాల్చినదానికన్నా తెగబారెడు
కరెంటు బిల్లొచ్చినప్పుడూ,
నామానాన నేపోతోంటె బురదనీళ్ళు
బస్సు వాడు చిమ్మినప్పుడు.
తిరపతి సకుటుంబంగా వెళ్ళినప్పుడు
, ఆటోకొసం చూస్తుంటె అందమైన
గుంట వుంది ఎంతోదబ్బక్కరలేదని
మిండగాడన్నప్పుడూ నాకు
చచ్చెంత కోపం వచ్చింది.
పిల్లలు మాట వినడము ఇష్టపడనప్పుడూ
లెక్క తప్పు చేసి మొండిగా అదే కరక్టన్నప్పుడు
కాని దానికీ,అయినదానికీ ఆవిడ అడ్డంపడినప్పుడూ
, అనే దానికీ,వినేదానికీ,మాటలకీ
సంబందం గూర్చి మీరాలోచించనప్పుడూ
ప్రాణాలు తీసుకునే త్యాగాలగురించి విన్నప్పుడూ,
మనింటి పక్కనే విరగబడి తాగే గుంపుల్ని
చూసినప్పుడూ చిన్న జలుబుకీ
చేతిచమురొదిలించే చికిత్స దాక్టరు చేసినప్పుడు
ఏడిచి బయటకు పారిపోకుండా
అమ్మ అడ్డంపడినప్పుడూ నాకు
చాలా చాలా కోపం వచ్చేస్తోంది
No comments:
Post a Comment