Saturday, September 5, 2015

Saturday, 27 April 2013 at 04:56 UTC+05:30




మామిడీ,మల్లీ,పనసా,పారిజాతమూ,
నేను మీ అన్నని,మీముందేజీవిస్తూంటాను
. దొరువులు చెసి యెరువులు కూర్చే నేస్తాన్ని.
నే అమ్మ కడుపులో మిమ్మల్ని దాచినప్పుడు
చిన్న విత్తూ,తీగకణుపూ,టెంకమొద్దూ అల్లనే
మీరున్నారు,నమ్మలేరు కదూ, ఔను
ఇప్పుడేమో నిండా కాయలతో పండ్ల గుత్తులతో,
అకాశాన్నీ నేలనీ చుట్టేసే పరిమళాలతో
అలరారిపోతున్నారు. మల్లీ,మాలతీ అయ్యి
వెలుగుకిరణాలేమాకు నెలవులంటున్నారు.
అన్నం పేట్టే అమ్మా నీళ్ళు పోసే అన్నయ్యనీ
కాస్త తలవంచి పలకరించరూ? మీ కాయలు
కొయ్యాలన్నా పూలు గుచ్చాలన్నా
అమ్మకి కోపం వస్తుంది. ఔనూ,
మీ వుద్దేశ్యము నాకు తెలుసు.
సూరిడిని,కొలిచి వానలుకురిపించాలనేగా
. ఎంత మంచి వాళ్ళు మీరు,
కాసిని నీళ్ళు నేపోస్తే, ఆకాసమంత
మబ్బుల పందిరివేసి సముద్రమంత
వానల నిచ్చే నేస్తాలేమీరు.
చివుల్లుమేసినకోయిలమ్మా
పలకబారిన ముంతమామిడిమేసిన
చిలకమ్మ,పాడుతున్నయి.
మామిడమ్మ మంచీ!,పనసమ్మ మంచీ, !
మల్లె మంచీ!విరిసిన పారిజాతం మంచీ !
మాలతి మంచీ,!మాఇంటి వెపమ్మ మంచీ,!!
కొమ్మల పలవలో పుట్టిన తేనె పట్టూ,
చెబుతోంది,మా అమ్మజోలికోస్తే
మేమూరుకోమూ పండు కావాలంటే
పడే దాకా ఆగు తేనె కావాలంటె,
పున్నమెళ్ళే దాకా ఆగని.
ప్రకృతీ చెబుతోంది,వానకావాలంటే
నదులు నిందాలంటే,వరిచేలు
పండాలంటే పండగ రావాలంటే
,బొజ్జలు నిండాలంటే చెట్టమ్మలనీ
తీగపాపల్నీ,తేనె తెట్టుల్నీ, కొండల్నీ
,కొనల్నీ,ప్రేమించూ,పూజించూ అని.

No comments:

Post a Comment