పైన ఎక్కడో దివ్య దేశమున్నది
. నేను నా మణీ మెట్లెక్కుతున్నాము.
పోనుపోనూ మెట్లు ఇరుకవుతున్నాయి.
అయ్యో ఈమనిషి అవస్త పడుతొందేమో?
అసలే మోకాళ్ళ సంధి!పర్వాలేదు,పదండి,
మనసు చదివిన మణి పట్టుకు పారాడుతోంది.
మరీ ఇరుకు మెట్లైపోయాయి
,శిఖరం పైన మూడుమెట్లసలే లేవు.
నేనెగిరెక్కితే తనో? ఎగలాగేందుకు
ఎవరైనా సాయం చేస్తారేమొ?
మణినా కాలు పట్టుకునే వుంది.
గట్టిగా పట్టుకో పైన పెరుమాళ్ళున్నారు
. ఎలుగెత్తి ఆక్రోశించా వరదా అని,
పోడుగైన స్వామి కుర్రవాడే,
చెయ్యందిస్తున్నాడు,దేముడా రక్షించావు
. నేను ఆవిడా అవస్త లేకుండా అన్ని
మెట్లూ దాటి నిన్ను చేరాము.
కానీ పైకెక్కేటప్పటికే తెల్లారింది.
స్వామిని చూడనేలేదు కల తెల్లారిపోయింది.
No comments:
Post a Comment