.పెంజీకటి
ఏది స్థిరము?స్థిరము కానిదేది? తిమిరము కవ్వలనున్న ఏకీకృతమై వెలుగు నది స్థిరమట. బొమ్మెర పోతరాజు చెప్పిరి. పరిశీలన ఎంత రుచికరమైనది!
లోకంబులు లోకేశులు లోకస్థులు
దెగిన దుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వం దేకాకృతి
వెలుగు నతని నే సేవింతున్.
పెంజీకటి అంటే మనకంతుపట్టని మన పుట్టక కి ముందు, మరణానికి పిమ్మట అని మాత్రమే అనుకుంటే అనుకోని అవాంతరమొకటి అడ్డము వస్తోంది. కళ్ళు తెరచుకొనీ చూడలేని వాళ్ళూ,బుద్ధి కలిగీ విచక్షణని వుపయోగించని వారూ,కలిగివుండీ కలిమి లేములని గుర్తించని వారూ,మనిషిగా జన్మించీ, మానవత్వాన్ని వుపేక్షించేవారూ కూడా పెంజీకటి లొ కొట్టుమిట్టాడే వారు సుమా.చావు పుట్టకల కావలి పెంజీకటి కన్నా జీవములుడంగా అనుభవించే పెంజీకటి ఘోరభయంకర మైనది. ఇట్టి తరి తరుణొపాయమెట్టిదని యోచించిరి.
No comments:
Post a Comment