.
దారి
మన శరీరములో ప్రాణి వుచ్చులుపోయబడివుంది. దానికున్న శ్వేచ్చ చాలా పరిమితము. తను ఆత్మకి ధారణ కల్పించగలిగినప్పటికీ,శరీరముయొక్క మెలకువ స్తితిలో ఆవరణాంచితమై శారీరిక కృత్యాకృత్యలకి విలవిలలడుతూ, మనోబుద్ధి వికారాలకి వేదన పడుతూ,విచక్షణ సాయానికి నిరీక్షిస్తూ వుంటుంది. ప్రాప్త కాల్జతా,పూర్వ జన్మ సుకృతమూ,గురుకృపా,గోస్టి ప్రాసాద మహిమా,మాతృదీవనాపుణ్యమూ గణ్యమైనప్పుడు మనోవాక్కాయ కర్మల ద్వారా వ్యక్తమై జీవన గమ్యాన్ని చూపే దారి కనుక్కుంటుంది. పరమాత్ముడు అన్నీ తనలోనుంచుకుని అన్నిటియందూ తానుంటూ తనాకౄతినే మనకిచ్చి,వూహలనీ, ఆనందానుభవాలనీ,సంతోష ధు;ఖాలనీ జీవ సర్పిలములోపొందుపరచి,విచక్షణా స్వేచ్చని కూడా ఇచ్చాడు. జన్మలెత్తడానికీ,రాహిత్యము పొందడానికీ కూడ అవకాశము కలిగివున్నాము మనుష్యులము. కానీ కాని కర్మలు చేసి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తి జన్మ జరా ధుఖాన్ని అనుభవిస్తూ వుంటాము.
No comments:
Post a Comment