Thursday, September 3, 2015

NE THODUNTAA



Saturday, 9 February 2013 at 20:57 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
వూరెల్లాం తుంజ్గియుల కెల్లాం నల్లిరుళాయ్
నీరెల్లాం తేరి,యోర్ నీళిరవాయ్ నీణ్డ్తాళ్,
పారెల్లా ముణ్డ్,నమంపాంబణై యాన్ వారానాల్,
ఆరెల్లే వల్వినైయేన్ అవికాపారినియే.

పాల సముద్రములో స్వామి యోగనిద్రలో యుండిరి. ఆయన అన్య విషయముల యందు నిద్రితులైనా,పరమభాగవతులైన ఆళ్వారాదుల నెట్లు తరింపజెయవలెనా' యని యోచించుందురట.ఇది ఆళ్వారుల మది సుమండీ.వారి మాటలలొనే, "వూ రంతా మాటు మణగినది. రాత్రి యీ విధముగా పెరుగుచుండగా నాశ్రియ:పతి వచి నన్ను రక్షించకున్న నాకు వేరెవరు దిక్కు?" అవి కాప్పా రినియా రాళ్ కడల్ మణ్ విణ్ మూడి మావికారమా యోర్ వల్లిరవాయ్ నీణ్డతాల్, కావి శేర్వణ్ణ నెన్ కణ్ణ నుం వారానాల్, పావియేన్ నెంజ్గమే నీయుం పాంజ్గల్లైయే. ఓ మనసా నేలా నీరు నింగి యేకం చేస్తూ కటిక చీకటి రాత్రిగా మారి లోకాలని ముంచివెసింది. ఈ సమయములొ క్రిష్న ప్రియ విరహము అహరహరమూ వేధించుచున్నది. నీవూ (మనసుకూదా) నన్ను వదలి శ్రీ వారి చెంతకు (నన్ను వదలి) పోయినావు కదా.

Saturday, 9 February 2013 at 12:09 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
లచ్చారావూ దీక్షితులుగారి అబ్బాయి పొస్త్మాస్తారూ
రాంభద్రుడు రాత్రి తొమ్మిది కావస్తోంది.చైనా ఆక్రమణా
మన సిపాయిల రక్షణా ఇదీ విషయము,డిస్కషన్ డీప్ గానూ
ఫ్రెంచ్ విప్లవ సమావెసమంత ఆవెశంగా కొనసాగిపొతోంది.
తప్పు చైనాదా మనదా?, రాంగురువు ఆరా.,
క్రిస్ణమీనన్ డిప్లమటిక్ దైలమ్మ నెహ్రు పంచశీల
పంచదారచిలకలూ చైనా వాడేమాత్రం పట్టీంచుకొలేదు.

Saturday, 9 February 2013 at 12:08 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.


Saturday, 9 February 2013 at 11:48 UTC+05:30




నే నులక మంచమ్మీద సగం మెలకువ సగం నిద్రలో వున్నా
తలుపులు లేని తడికెల గది తలపులోలేని తడీస్పర్శ
గుండె చప్పుడుకు చెవులవిసి పోతున్నాయి
గంతల్లోంచి చూస్తే ఆకాశంలో చుక్కల్ని చెరిపేస్తోందామె
తడికెల చిల్లులు చీకటికి జల్లెడ పడుతున్నయి,
చిక్కిన చుక్కలు రెక్కలు కట్టుకు ఎగిరిపోతున్నాయి.
ఆమె ఇంకా ఆకాశానికి సిరా పూస్తోంది.
మెరుపుల హాసరేఖలు వూర్పుల వురుములు
వూడిన రెక్కల,రాలిన చుక్కల మధ్య
పెళ్ళలై పొయిన నులకమంచం అది నాస్వంతం,
దానిమీదే అరిషడ్వర్గాలని జయించాలని కలగన్నా,
గొంగలి చాటు నాచూపులు
చుక్కలవెంట కళ్ళతొ సహా తిరిగిపోతున్నయి
గుండె చప్పుళ్ళు వినబడవు,వెనకబడినట్టున్నాయి
హమ్మయ్యా ఇక చుక్కలు చూడవు నేనొస్తున్నానుండు,
అంటోదినిశీధిగళం ,కానీ నేను లేనుగా,కాళ్ళూడిన
మంచం పాడికి పనికొస్థుందిలె,చిల్లుల గొంగలి
వస్త్ర సంస్కారానికి సరిపొతుంది అయినా పర్వాలేదు
నేనూ అవశేషాన్నే వెలుగులొ నువ్వు కరిగిపోయెదాకా నేతోడుంటా 

No comments:

Post a Comment