onday, 11 March 2013 at 21:48 UTC+05:30Tiruvengalan Swaamin updated his status.
ధ్యానము అంతే ఆత్మావలోకనమే. శరీరిక,మానసిక ఆవరణలన్నింటినీ దాటుకుని అంతరాళములో మెలకువ అంటే స్పృహ పొందడము. ఒకచోట కుదురుగా కూచుని నిద్రలోకిజారిపోకుండా, ఆలోచనావస్తలని అధిగమించి,చిన్మయాన్ని చేరుకోవడమే.ప్రవృతి,నివృతి ల రెంటికి అతీతమైన స్తితి సుమండీ. ప్రవృతి అంటే,"ప్రకృతి లొ జీవి నిరంతరమూ ఎదోపని సంకల్పితము గానో అసంకల్పొతముగానో చేస్తోనే వుంటుంది. ఆపని దిశ, ఫలవంతతా వుపేక్షించి,పనిని కూడా మనసులోకి చొరకుండా నిర్వర్తన చేసి,స్తితి లోకి ప్రవేసించాలి. ప్రకృతి ప్రవృతి ని వుద్దీపన చేస్తుంది. కాని మనము ఆస్తితిని నిరోధించి, వ్యక్తిగతానికి వస్తే నివృతి దశని చేరుకుంటాము. ఇప్పుడు మన శరీరం నిద్రపోతామొర్రొ అని గోల చేస్తుంది,కాని అలా నిద్రలోకి జారిపోతే మళ్ళీ ప్రవృతి మనకాయమే కాకుండా పరకాయాల్లోకీ,మనసుల్లోకీ ప్రవహించి ప్రకృతి లో సమర్ధమైపోతుంది. ఈక్కడ కొంచెం జాగ్రత్త పడి నిద్రా ముద్రలోకి జారకుండా నిశ్చల నిశ్శబ్దములొ జాగృతతతో మనము వుండే దశయే ధ్యానము.
No comments:
Post a Comment