Friday, September 4, 2015

mixed poems

uesday, 12 February 2013 at 14:27 UTC+05:.

ఇళ కలలొ



రాత్రి నేనేమై పొయాను?
పగలు 'నేను' కి పరిచయం లేని
నిద్రా నిసీధి లో పరకాయ ప్రవేశం చేసా
 నేను భయమేస్తేతప్ప తొందర పడను
 ఇంకా నిద్రలో జీవిస్తాను, ఇంటిల్లిపాదీ
'ఏమి వీడి మొద్దు నిద్ర?'
తెల్ల్లరింది లే అని తట్టి లేపాలి
కలనే నిజమని అచ్చం నాకనిపిస్తుంది
నిజం 'భ్రమ' గా అనుకుంటా
నిన్న కల నేటికి కొనసాగి
పగలు పాపాయినైపోతాను
వైవస్వతుడు శ్రద్ధా మనువాడి
ఇళ కలలొ నిజముగా
సుద్యుమ్న్యుడు గా పగలు
ఒక ఒరలో రెండు కత్తులు.
కలలో కొట్టుకుపొయీ
మెలకువ తీరం చేరే
నెమరేస్తే రాదె నాస్ప్రుహ

Tuesday, 12 February 2013 at 09:54 UTC+05:30

అనంతాలని అధిగమించాలంటే
వేగమూ,ధ్రుతీ కలబొసిన స్థితి కావలె
ఆద్యంథాలలోకి తొంగిచూస్తూ
సూర్యుడు దిగంతాలలో
అంజలిమోడ్చి హనుమంతుడూ
ప్రచోదనము చేస్తూఒకరు
,ప్రపన్నులుగామరొకరూ

Tuesday, 12 February 2013 at 08:57 UTC+05:30

విమలమతిగా పునర్జీవించాలని


.
నేను దిగ్గజాన్ని కావలె.ఎందుకా?
దిగంతాలగుండా అనంతాన్ని స్పర్శించడానికి
నా రోమకూపాలన్నీ మనో నేత్రాలు కావలె. ఎందుకూ?
పరమాత్మ పరిపూర్ణత్వాన్ని దర్శించడానికి అంటే,
'నే' అనే అహము నా శరీర భ్రాంతి నుండి విడివడడానికి
 నా పసితనమునాటి నిరపేక్షత్వాన్ని నాలో నింపుకుని
నిద్రలో,భగవన్ముద్రలో మయి మరచి
విమలమతిగా పునర్జీవించాలని. ఏంతెలుసుకొవాలని?
'నా వునికి,ముందు, వెనుక, తర్వాత 'ఎందుకు?
అజ్గ్నానంలోనే చేసిన పనులు తిరిగి చేసి
విచారించకుండా,వుందేందుకు మరీ,

No comments:

Post a Comment