Friday, September 4, 2015

nijaaniki gElam veyyaali.

Sunday, 17 February 2013 at 13:31 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.

నిజానికి గేలం వెయ్యాలి



నిజానికి గేలం వెయ్యాలి.



నిజానికి గేలం వెయ్యాలి.
కానీ కళ్ళు తెరిచేటప్పటికే,
నిసీధిలో నిజం కరిగి పోతుంది.
పగలు పరిగెట్టే ప్రాణానికి,
ఎప్పటినిజాలే గుడ్డిగా కనిపిస్తాయి.
మెలకువలో నదులూ, నగరాలూ,
నడుమ నన్నెవరూ, పట్టించుకోరు.
అడవిలో పూసిన గడ్డిపువ్వూ,
కాసిన గుడ్డీ వెన్నెలా నిద్రలో,
నిజంగా వాటేసుకుంటాయి.
సర్పాలూ,సౌధాలూ,మామూలుగానే కాన వస్తాయి.
,వళ్ళునిద్దరోతున్నా కళ్ళు చూస్తూనే వుంటాయి.
కొత్త వూరిలో దారులు తప్పినట్టు
కలల లోనూ గుర్తులు చెరిగి పోతున్నాయి
. చివరికి భయం గడ్డ కట్టి,
ప్రాణాం కడబట్టి,కలవరిస్తాను.
విన్నవాళ్ళు,మామూలే
వీడు మళ్ళీ పలవరించాడంటారు.
పగళ్ళూ, వూళ్ళూ,పగుళ్ళు,
మనిషి కీ మనిషి కీ మధ్య
మసి బారిన నీరెండిన సెల ఏళ్ళూ
వడిసెల కర్రతో విసురుకునే రాళ్ళూ.
నిద్రా లోకంలో నిలవరించేవి
నాచేతుల చేతలే,నా చూపుల వంకరే
జరుగుతున్న విశెషాలని ఆత్మ
అనవరతమూ తూర్పారబెడుతూనే వుంటుంది.
. అయినా మనసు వినక పొతే,
కలలొ ఎవరొ తెలీనివాళ్ళు
చింత బరికెల మంత్రం వెస్తూనె వుంటారు.
నిద్రా ముద్రల్లో,సిక్షా స్మ్రుతీ,వెనువెంటనె
భరించలేనప్ప్డు ఎల్లగొ చచ్చీచెడీ మళ్ళీ
మెలుకవ చావు తప్పి కన్నులొట్టబోయి... ఔను,
అందుకనే కంసుడికీ, హిరణ్యకసిపుడికీ, నిద్ర లేదు,
 నిద్రా మెలుకువాసంధ్యలోనే తెల్లారాయి.
నిద్రేనయం. భయమేస్తే, లేవచ్చు,
కలవరించచ్చూ. కానీ, వూపిరి వుంటేనే పగలు.
లేకుంటే అందరూ, అపరిచితులే కావచ్చు.
నిన్న రాత్రి నే చూసిన నిద్రా నగరంలో,
సౌధాలూ, సౌదామినులూ,పురగోపురాలూ
, నదులూ,సముద్రాలూ, నరులూ,సహచరులూ,
అలవాటయిన దారులూ, ఏమాశ్చర్యమూ
పగటి చుక్కల కలభామినులూ,
పగలు లేని తల్లితండ్రులూ.,
చుట్టపు చూపుగా వారి పలకరింపులూ,
వరుసగా కాకున్నా వావి వరసలులెకున్నా
నన్నాదరిస్తూనే వున్నాయి.
మెలకువలోకి తన్ని నన్నేమారుస్తున్నయి.
నెనేమైనా తక్కువ తిన్నానా మళ్ళీ
భెతళాన్ని భుజాన్నేసుకుని నిద్దరోతా,!!

No comments:

Post a Comment