Tiruvengalan Swaamin updated his status.
Tiruvengalan Swaamin updated his status.
Tiruvengalan Swaamin updated his status.
కృష్ణ స్వామి గోకులం వదలి మధురా నగరానికి వేంచేసారు . అయ్యో గొకులమెన్త వగచినదో కదా. మరి మధురా నగర హృదయము వుప్పొంగదా. స్వామి పాద ఘట్టన చేత నగర శరీరి పావనమై, పులకితమై తన ఒడిపై, వసించే జీవ జాలానికి అమృతభక్తి పారవశ్యతా ప్రసాదాన్ని ధూళిస్పర్శా మాత్రాన్న పంచినది.. ఔను మధుర భక్తి మధూకరాన్ని యాచిన్చినా, యాచించకపొ యినా ప్రసాదిస్తుంది. గోకులం స్వామి వారి వాయు లీన తరంగాల చక్ర భ్రమణంలో, నామ సంకీర్తనా తపస్సులో తప్త కాంచన మైపోయింది. తరుణీ మణులు, తరువులు, గిరులూ, తీవలూ, చేలూ, కాళిన్దిదీ నదీ, శుక, పీక, శారికాది పక్షులూ సమస్తమూ స్వామి వారి ఆనుభూతుల మైమరపులో ఆత్మ చింతన లో అమృత మూర్తులైనారు. నగర మాత సచేతనమై, సకుటుమ్బీకముగా తత్ పరతా భాగవత స్పర్శా భాగ్యాలతో మనకోసం బృందావనమై ఆనంద ననదనందనమై ఎదురు చూస్తోనే వుంటుంది. సందేహము లేదు. మీరా తల్లి పాటల మాట లలో రితు వసంతము అక్కడ స్థిర నివాసి అయ్యింది. ఇంకా వేణుగానం తెల్లవార గట్ల వినిపిస్తూనే వుంటుంది. వినాలంటే మరి బుద్ధి మంతులమై మనలోనున్న దీప లేశా న్ని రగిల్చి భక్తీ ధారతో తడిపి సిద్దం కావాలి. స్వామి వారు మధురలోనే కాదు మన మధ్య కూడా ప్రత్యక్షమౌతారుట. ఎప్పుడంటే మనలోనే ఆయన వాసాన్ని నివాసముగా మార్చుకుంటేను. అమ్మ గోదా తల్లి తులసీ మాలతో రంగనాధ స్వామిని కట్టి వేశారుట. అయినా ఆమె స్వామి వారు లోకసంచారి అయినప్పుడు వారికి సారస పక్షులతోటి భక్తి నివేదన చేస్తూ వుండేవారట. ఇదుగో ఆ పాసురాన్ని చదువుకున్దాము. వైకల్ పూన్గళి వాయ్ వందు మేయు జ్జ్ఞురుకినజ్ఞాల్, సెయ్ కొళ్ శేన్నె లుయర్ తిరు వణ్ వన్డూ రురయ్యుమ్, కై కొళ్ శక్కర తెన్ కణివాయ్ పెరుమానై కన్డు, కైకళ్ కూప్పి చ్చొల్లీర్ వినై యాట్టి యేన్ కాత న్మైయే . రోజూ ఉప్పు చేలకి వచ్చి ఆహారాన్వేషణ చేసే ప్రియమైన సారస పక్షుల్లారా, మీరు తిరువణ్ వండురు పొండి . అక్కడ మీకు ఎర్రని దాన్యాలతోబాటు భక్తి ప్రసాదము దొరుకుతుంది. ఆ దివ్య తీర్థము లో స్వామి శంఖ, చక్ర, గదా, శార్జ్ఞ్జ పాణి గా వెలిసివున్నారు . నా బదులు గా మీరు వినయ నమస్కారములు చేసి ఆత్మ వివశురాలనైన వేదన ని విన్నపము చేయరూ. అమ్మ వారి బాహ్య స్పృహలో తన మనో బుద్ధి జవజీవాలు స్వామి వారి వెంటే పోయిన విషయం నిష్టూర సత్యమై నిలిచిపోయి ఆమె వాక్కాయములని నిలవనీయదయ్యే. చెట్టునీ, పుట్టన్నీ ముట్టి హా సీతా, హాసీతా అని కౌగలించుకుని తన మంగళా శ్రువుల ఆర్దతా ప్రసాదముతో కైవల్యాన్ని ఇచ్చిన శ్రీ రామ చంద్ర మూర్తి చర్యలకు అమ్మ వారి చేష్టి తాలకు ఎంత పోలిక? ఆండాళ్ తిరు వడి ఘళియే శరణమ్.
Tiruvengalan Swaamin updated his status.
మధురం ప్రాప్య గోవిందః కథం గోకుల మేష్యతి నగర స్త్రీ కలాలాపమధు శ్రో త్రే ణ పాస్యతి
Tiruvengalan Swaamin updated his status.
kariyavaagi, pudai parandhu, miLirndha, sevvariyOdiya, neeNda, ap periya vaaya kaNgaL.." (those dark, well spread, shining, ruddy lined, long, large eyes)- He bursts out: అనంత సౌందర్యం తో శాన్త సముద్రంలా నిశ్చలా నందం తో చల్లని వెలుగులతో సోగతీరిన విశాల నేత్రాలతో విరాజిల్లుతున్న నా స్వామీ నావద్ద ఏ మున్నది నీకు సమర్పించడానికి? నా అర్హతలన్నీ నిరర్ధకములే, నీ సత్య సంగతానికి దూరమైన నా జ్ఞాన, లౌకిక సంపదలన్నీ నిరుపయోగములే. సముద్రుని దాహము సూర్యునికి వెలుగు నేనేమి చూపకలను? రంగ నాధా స్వామీ
No comments:
Post a Comment