Thursday, September 3, 2015

jnaanamu

Thursday, 28 February 2013 at 13:32 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
దేవమాయంజేసి దెహాభిమానులయిన మానవులకు బగవాడు బంధుండను శ్రీమదాంధ్రభాగవతములోని దశమస్కంధ పూర్వభాగము లోని రుక్మిణీ ఖెదహరణము. ఆత్మ అనే విశేష విషయ లక్షణ వివరణ. మోహంబు సిద్దంబయియుండు. జలాదులయందును జంద్ర సూర్యాదులును ఘఠదులందు గగనంబును బెక్కయి కానంబడు భంగి దేహధరుల కందరికి నాత్మ యొక్కండయ్యును బెక్కండ్రయి తోచు. ఆద్యంతంబులు గల ఈ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకంబయి యాత్మయందు నవిద్యచేతంగల్పితంబయి దేహి ని సమారంబునం ద్రిప్పు. సూర్యుడు తటస్థుడైయుండ బ్రకాశమానంబులయిన దృష్టి రూపంబులంబోలెనాత్మ తటస్తుండైయుండ దేహేంద్రియమబులు ప్రకాశమానంబులగు. ఆత్మకు వేరొక్కటితోడ సమ్యొగ వియోగంబులు లేవు. వృద్ధి క్షయంబులు చంద్ర కళలకుంగాని చంద్రునికి లేనికైవడి జన్మనాశంబులు దేహంబునకుం గాని యాత్మకుంగలుగనేరవు. నిద్ర వోయినవాడాత్మను విషయఫలానుభోగంబు సేయించు తెరంగున నెరుకలేనివాడు నిజముకాని అర్ధంబునందు భవంబు నొందుచుడునుగావున, కందము: 
 అజ్ఞానజ మగు శోకము
 విజ్ఞాన విలోకనమున విడువుము నీకున్ 
 బ్రజ్ఞావతికిందగునే
 యజ్ఞానులభంగి వగవ నంభోజముఖీ

No comments:

Post a Comment