Friday, September 4, 2015

Saturday, 9 February 2013 at 10:15 UTC+05:30

వేళ తప్పుతుందే ఎలా




నిన్నటినుంచి విప్పుతూనే వున్నా
విప్పినకొద్దీ చిక్కుపడుతోంది
ఇక ఝంజం ఎప్పుడేసుకోవాలి?
వేళ తప్పుతుందే ఎలా
లెఖ్ఖ తేలదూ,ముడి విడదు
, నా బుర్ర కేమౌతోంది?
నిన్న నాచేతిలో నలిగిన
రూపాయిలెక్కడ పెట్టాను?
ఇప్పుడు పాడిన వందేమాతరం
ఇంకా గొంతులోనే వుంది,
కానీ స్క్రిప్టు ఎక్కడ పెట్టాను?
మతి వుంది చేసిన పనులన్నీ
సంగతులు తప్పుతున్నాయి.
తలుపేసిన సతీమణీ
ఎందుకు బంధిస్తున్నావ్?
అయ్యొ కాదండీ,
ఇంట్లొ ఈగలమోత!,
కస్తూరివారు వచ్చేస్తారెమో
అని కక్ష కట్టావా,
నా పాటలకయితలు
నా రూకల మూటలు
ఎక్కడ ఎక్కడ ఎక్కడ??

No comments:

Post a Comment