Tiruvengalan Swaamin updated his status.
Tiruvengalan Swaamin updated his status.
Tiruvengalan Swaamin updated his status.
మళ్ళీ అంతర్మధనంలోకి ధనం మూటకట్టుకొని వల్ల కాటిలో
నా వల్ల కాదన్నా వ్యవసాయం ఏ సాయం లేకున్నా
పంచ భూతాల పంచన మొదలు పెట్టా మొదట
చితాభస్మం మూటగట్టి సంచిత పాపకర్మల మూట
విప్పి వుపా కర్మ కోసం చితుకులేరాను. రాను
మొర్రో అనే జీవాల ఏడ్పులు శవ దహనాలౌతోంటే
నిశ్శబ్దమైపోయాయి. వల్ల కాటిలో నిజం వికృతంగా నవ్వుతోంది.
భ్రమల తెరలూ,మోహపు పొదలూ పూత రేకుల్లా కాలిపోతున్నాయి.
పెంచిన కొవ్వు, తాగిన నెయ్యి పరసురామ ప్రీతై పోతున్నాయి.
యెలుగెత్తి ఏడ్వలేని జీవాలు శిలా ముద్రితమై
ముగ్గుల్లోంచి తొంగి చూస్తున్నాయి. ప్రేతాత్మల ముగ్గులెంత వికారం
| చంపుకు తిన్న మనుష్యులు తగలడిపోతూంటే,
చంపి తిన్న జీవాల ఆత్మలు పగలబడి నవ్వుతున్నాయి.
Tiruvengalan Swaamin updated his status.
.తేనియ చిలుకు తెలుగు పలుకు వేణువులూదు
మోహన రాగము తూరుపు హిందోళము వెరసి
రాశికి మానిని మత్తేభము సరస కందమునందము
కృత యుగమ్మున సంస్కృతంబది పాడియై
శృతుల స్మృతుల కతల వెతల పాటల
మృతవీరుల అమృత గాధల దృతంబు
మీదనచ్చుకు నెచ్చలియై ఖఠిన శిలా నాసిక
నల్ల నెల్ల జాలువారి వారాసియై
పాపములడంచు గోదారియై,
కానకొనల పచ్చదనంపు పల్లె పదములై
నన్నయ గంటంబున అమృతమై,
తిక్కన ప్రక్కన పెన్నగ చిన్నగ నగుచు
నాట్యమాడుచు నిర్మలమై"తెనుగై"నది.
భక్తికి శృంగారముల రంగు చీరలుగట్టి
బొమ్మెర వద్ద బొమ్మల కొలువై కాకతీయగడ్డ
కాషాయ రోషపు నెరసుల పాటల
మాటల మూటైన వెలుగు తెలుగు.
కోటి వీణల రాణి పాట పాడినది,
మేటి తేటగీతల సాటి ఆటవెలదుల
రాటుదేలిన కోమటిబిడ్డ భక్తి గానముల
చాటువై,ద్విపదయై మానవీయై మానినియై
సిద్ధవటమున బుద్ది సారమై పొతులూరి
వీరబ్రహ్మ వాచక కాల జ్గ్నానమై
మొల్ల తల్లి రామాయణమై పెద్దన
కవికూటమి మద్దెన కవనమై
రాయన సరసన జిగియై బిగియై
యెర్రన మందారమై ఒగ్గిపాతై,
చద్దిమూటలై వెల్గొందినది
తెలుగు తూరుపు రెక నాభాష.
ఇచ్చా రహిత మోక్ష ప్రదాత నాభాష
లజ్జ విడిచిన ఇజాతి అషాడభూతులనొట
బూతై,రాతై,వెతయై గోడల గుడుల జాడల
అంగాంగములందు అన్యాసక్తయై
మసి రాతయై రసి సిక్తమై జాంతవయై
స్వాంతనకై యెలుగెత్తి ఏడ్చుచున్నది
కసాయిదర్పదృష్టయై శల్యావసిస్ట
గాక మున్నె ఇచ్చపూర్వక నిష్టతో కర్పూర హారతులిద్దుముగాక
మోహన రాగము తూరుపు హిందోళము వెరసి
రాశికి మానిని మత్తేభము సరస కందమునందము
కృత యుగమ్మున సంస్కృతంబది పాడియై
శృతుల స్మృతుల కతల వెతల పాటల
మృతవీరుల అమృత గాధల దృతంబు
మీదనచ్చుకు నెచ్చలియై ఖఠిన శిలా నాసిక
నల్ల నెల్ల జాలువారి వారాసియై
పాపములడంచు గోదారియై,
కానకొనల పచ్చదనంపు పల్లె పదములై
నన్నయ గంటంబున అమృతమై,
తిక్కన ప్రక్కన పెన్నగ చిన్నగ నగుచు
నాట్యమాడుచు నిర్మలమై"తెనుగై"నది.
భక్తికి శృంగారముల రంగు చీరలుగట్టి
బొమ్మెర వద్ద బొమ్మల కొలువై కాకతీయగడ్డ
కాషాయ రోషపు నెరసుల పాటల
మాటల మూటైన వెలుగు తెలుగు.
కోటి వీణల రాణి పాట పాడినది,
మేటి తేటగీతల సాటి ఆటవెలదుల
రాటుదేలిన కోమటిబిడ్డ భక్తి గానముల
చాటువై,ద్విపదయై మానవీయై మానినియై
సిద్ధవటమున బుద్ది సారమై పొతులూరి
వీరబ్రహ్మ వాచక కాల జ్గ్నానమై
మొల్ల తల్లి రామాయణమై పెద్దన
కవికూటమి మద్దెన కవనమై
రాయన సరసన జిగియై బిగియై
యెర్రన మందారమై ఒగ్గిపాతై,
చద్దిమూటలై వెల్గొందినది
తెలుగు తూరుపు రెక నాభాష.
ఇచ్చా రహిత మోక్ష ప్రదాత నాభాష
లజ్జ విడిచిన ఇజాతి అషాడభూతులనొట
బూతై,రాతై,వెతయై గోడల గుడుల జాడల
అంగాంగములందు అన్యాసక్తయై
మసి రాతయై రసి సిక్తమై జాంతవయై
స్వాంతనకై యెలుగెత్తి ఏడ్చుచున్నది
కసాయిదర్పదృష్టయై శల్యావసిస్ట
గాక మున్నె ఇచ్చపూర్వక నిష్టతో కర్పూర హారతులిద్దుముగాక
Tiruvengalan Swaamin updated his status.
No comments:
Post a Comment