Thursday, September 3, 2015

vaishnavulu

ఏస్ టి పీ వారు పోస్టాపీసునే నమ్ముతారు.
గొడవలాడేస్తారు గొడవర్తులవారు.
ముడుంబ వారు బడంగి పేటలోవుంటారు.
మరింగంటివారు అపర రామానుజులమనే దురదవారు.
చిలకమర్రి వారికి వుండనేవుంది చిగురంత వెర్రి.
నల్లాని వారు చక్రవర్తులు కారు.
తూపురాణివారు ఆడలేక మద్దెల ఓడన్నారు.
కందాళవారు పెందరాళే లేవరు.
పిలకముడివారు, పల్లెర్లమూడివారు,
పుదిహెళ్ళవారు,గుదిమెళ్ళవారు,
తట్టా వారు,బుట్టా వారు,
వారూ,వీరూ చుట్టాలంటారు.
అయినవాళ్ళు కొట్లాడుకున్నారు.
కానివారు కొంప ముంచుకున్నారు.
జియ్యరు వారూ,అయ్యరువారూ,
వుద్దరిణెలో తీర్థంవారూ, గిద్దలో సుద్ద వారూ,
గొచీపాత సాక్షిగా పేచీకోరు వారు.
మంచి వారు,మనుగడలేనివారు
మొగమాటము వున్నవారు,
చెతివాటం లేనివారు వీరు శ్రీ వైష్ణవులు
వీరత్వం కోరని వారు,
వుభయ విభూతులంటె చెవులురెండూ కోసుకునేవారు
మావారు వీరు వైష్ణవులు
కులమంటే గుణమనేవారు
తడీ మడీ చాదస్తమున్న పెద్దలు కలవారు
మావారు వైష్ణవులు, రంగడి పెరెన్నుకునేవారు
గోదమ్మని కొలుచుకునే వారు
చక్ర పొంగలి దద్ధొజనమూ పంచే వారు
,సర్వులకు ప్రేమను భక్తిని,ప్రపత్తిని పంచెవారు
మావారు వీరే వైష్ణవులు.
పరమపదించని పరంపర వారు
తలితండ్రులే గురువులు దైవమైన వారు
మావారు వైష్ణవులు,వున్నడి పిన్నడీ రెండూ చదివేవారు
పల్లాండు సాయించువారు
మావారే,నామాలతో సుపరిచుతులు
అడవులలో మాడవీధులలు దారి తీసినవారుమావారు.


No comments:

Post a Comment