అహాహ్హహ:
Tiruvengalan Swaamin updated his status.
నిన్నటి చిరుగాలి,నేడు జంఝామారుతం
నిన్నటి లేత మబ్బు,నేడు కారు మెయిలు.
నిన్నటి చిలిపి తగవు,నేటి ప్రబలపోరాటం.
నిన్నటి మరకలు,నేటి కళంకాలు.
గాలీ మబ్బూ,నిన్నా నేడూ, నిస్చేష్టతలో,నేను
మోహం పెరిగింది,వ్యామోహం ముదిరింది.
చెత్తొ సముదాయించి ఒదార్చే పసి విషయం,
కసి కాలకూట విషం దూసినప్పుడు,
గోటితో పోయేదానికి,గొడ్డళ్ళు బద్దలౌతున్నాయి
. చేష్టలుడిగి చేతులెత్తేశా. మేధా, నిన్న నిద్దరోయావ్
వ్యధా సంచలితమైపోయావ్ తమ్ముళ్ళూ,చెల్లెళ్ళూ,
నిన్నటి చిన్న వాళ్ళు, నాకన్నా నాకన్నవాళ్ళకన్నా
గొప్పోళ్ళూ మరీ పెద్దవాళ్ళు నా చిన్నప్పటి ఆనవాళ్ళు
గతజల సేతు బంధనంలో, కరగిపోయిన నాగటిచాళ్ళు.
No comments:
Post a Comment