Thursday, September 3, 2015

a bunch of issues

Wednesday, 6 March 2013 at 11:56 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.


దిగంబర స్వామి, దిగంతాలలో పస్చిమమై, సద్యోజాతగా, స్వయంభువుగా, , శంభువుగా ఆదిత్యునిగా, భూమి గా పిలవబడ్డారు., మృత్తికా శివమే. ఆయనవుత్తరదిశనావరించి,సమస్తానికి వునికి, స్వభావాన్ని కలిగించి,సుజలరాశియై వామదేవులు గా వర్ణించబడ్డారు. దక్షిణామూర్తిగా వుత్తేజాన్ని,స్తబ్దత్వాన్ని ధరించారు.అగ్నిగా తెజస్సుగా గమనించబడ్డారు.తత్పురుషుడుగా చెప్పబడ్డారు.సర్వాన్ని ధ్యానములో అవధరించువారు.ఈశాన్యములో ఆయన ఈశానుదు.అనంతములో ఆయానే ఆకశము
===================================================================

Wednesday, 6 March 2013 at 22:09 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
అరయగ నిన్నెరగ నేర్వ సురనుత ఎన్నదగ కార్య పరవశమున నన్నె నే మరచి దురిత చిత్తభ్రమలందొదిగి వరశరీర విక్రయంబున దివారాత్రంబులు మ్రింగితి త్రియంబకుని అంబరీషుని శివుని,భవుని మరచి జరా మరణ చక్రంబు చక్కనొత్తిన దేహంబు ప్రిదిలి పీలికలౌవిధంబు మకరి శరీరీ మన్నచేయవె శివరాత్రి చీకటింటి మనస శివ శివ యను కలి తొలగు వేకువ గల మదికి కలుగు ముదము,నెమ్మది,కలిమి బలిమి.
========================================================================

వడ్డాది పాపరాజు బొమ్మగుమ్మల వలరాజు 
సమ్ముదంబు నందమ్ము డెందమ్ముచ్చాయ 
మెరుగైన చిత్రరాజమ్ము కధకు కాళ్ళు
వూహకు కళ్ళూ బ్రహ్మ రాతలకు బొమ్మ
గీతలల్లు ప్రాణం పోయు రూపమునిచ్చు 
భీతాంగనకు స్వేత కేతుకు ఆది దెవునికి 
భాసురసరస్వతికి నారదనీరదములకు 
వడ్డాది పాపరేడు.అపరబ్రహ్మ అతడు .


Thursday, 7 March 2013 at 22:01 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
.దీపమున్నప్పుడే ఇల్లుచక్కపెట్టుకో,
 కళ్ళల్లో నీళ్ళు,మునకలేస్తున్న దేహం 
'అహరహరమూ నిన్నుకనిపెట్టుకున్నా' 
'అహాన్ని, నేనే, దేహమా, మునకెయ్యకు! 
ఇహలోకంలో నా ఆశలహరివిల్లు శరభంగమైపోతుంది,
 బుద్ధీ, నీవైనాచెప్పు! 'తన్నుకోకండి,కరచరణాదులారా'! 
నేబుద్ధిని, ప్రాప్తకాలజ్ఞత పొందండి. ఓ ఆహార గహ్వరమా 
తినత్రాగమరిగిన నీ కుక్షికి వాయుస్తంభనే తరుణోపాయము.
 కలశకుంభము కుడితి గోలేంచేసుకున్నావు.
 ఇతే ఒపనిచేయి! బిర్రబిగుసుకు పో, కాల్సేతులు
 కైమోడ్చి,ఇష్టప్రార్ధన చెసుకో. ఇప్పటికైనా 
సంసార సముద్రంలో ఈత నేర్చుకో. 
మునిగిపోయిందేమీ లేదు,రేపైనా తేల్తావు!
 పైగా మహా కుంభమట,మిడిమేళముకాపోతే
 అంబ సముద్రములో ఐనా తేలతావు. బుద్ధీ! 
నీకుపని చెపితే సంకటములో శ్రీరంగ నీతులా,
బొందములిగిపోతోంది., అహమా, 'ఇప్పుడైనా 
రావే ఎశ్వరా అని పిలూ నా ఒప్పులకుప్ప
 తప్పుల తడకే, నానోట్లో నీళ్ళు.,
 తడిసిమోపై ఆరిపోతున్నా! "నేనాత్మని",
 వెళ్ళొస్తా, నీ అరిషడ్వర్గాలని మళ్ళీఆరబోసుకో! 
ఈసారైనా దీపమున్నప్పుడె ఇల్లుచక్కబెట్టుకో. 



Thursday, 7 March 2013 at 21:59 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
దిగంబర స్వామి, దిగంతాలలో పస్చిమమై, సద్యోజాతగా, స్వయంభువుగా, , శంభువుగా ఆదిత్యునిగా, భూమి గా పిలవబడ్డారు., మృత్తికా శివమే. ఆయనవుత్తరదిశనావరించి,సమస్తానికి వునికి, స్వభావాన్ని కలిగించి,సుజలరాశియై వామదేవులు గా వర్ణించబడ్డారు. దక్షిణామూర్తిగా వుత్తేజాన్ని,స్తబ్దత్వాన్ని ధరించారు.అగ్నిగా తెజస్సుగా గమనించబడ్డారు.తత్పురుషుడుగా చెప్పబడ్డారు.సర్వాన్ని ధ్యానములో అవధరించువాడు.ఈశాన్యములో ఆయన ఈశానుడు. Wednesday at 23:15 · Like · 1


Thursday, 7 March 2013 at 21:59 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
అరయగ నిన్నెరగ నేర్వ సురనుత ఎన్నదగ కార్య
 పరవశమున నన్నె నే మరచి దురిత చిత్తభ్రమలందొదిగి 
వరశరీర విక్రయంబున దివారాత్రంబులు మ్రింగితి 
త్రియంబకుని అంబరీషుని శివుని,భవుని మరచి
 జరా మరణ చక్రంబు చక్కనొత్తిన దేహంబు ప్రిదిలి 
పీలికలౌవిధంబు మకరి శరీరీ మన్నచేయవె 
శివరాత్రి చీకటింటి మనస శివ శివ యను 
కలి తొలగు వేకువ గల మదికి కలుగు 
ముదము,నెమ్మది,కలిమి బలిమి. 1


Thursday, 7 March 2013 at 21:58 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.



Thursday, 7 March 2013 at 09:55 UTC+05:30

the tragedy is appalling and the war always brings inconsolable sorrow be it mythology or real life. death lays its icy hands even on kings. what a surprisingly bewildering truth. So much is said about death and so true that every body dies every living thing perishes. time is relentless as regards live and death. few wreaths,few more tears, and gone the scene. The world continues to roll on and on. The people behind death are put up with memories which become feeble and feebler as the wheel turns and groups and times keep trouncing down at times as a surmise and other times as inevitably obvious. After that it is sheer oblivion.






Wednesday, 6 March 2013 at 13:12 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
విచార కాసారంలో ఒంటికాలిపై కుంటిజపం 
ఎంతటి వేదాంతం? విడ్డూరంగా విషాదం 
చీమలో,బ్రహ్మలో రామ రామ,నువ్వే
 దోమల్నీ,పాముల్నీ ఈగల్నీ,తేనెటీగల్నీ, 
అఖరికి గొల్లభామల్నీ, వానపాముల్నీ
మందుజల్లి మాటుపెట్టి,కర్రల్తోటీ, కత్తులతోటీ,
మనుషుల్నైతే మాటల్తోతీ,చేతల్తోటీ, 
ఖూనీ చేస్తూనే వున్నా మళ్ళీ మంచి
 మనిషిననీ పెద్ద పేరూ,వూరూరా దండోరా. 
బండలాంటి గుండెలున్నవాళ్ళూ, కొండల్నీ
 పిండి చేసీ ప్రకృతికి కన్నం పెట్టేవాళ్ళూ, 
+పళ్ళిచ్చే చెట్లని రాళ్ళతోకొట్టెవాళ్ళూ, 
శిధిలమైన వూహల్లో, చీకటి యుగపు జాడల్లో
, జీవిస్తూ,ఇంకా సంపద శాస్వతమనుకునే, 
నాలొనివసించే సవాలుగాళ్ళూ, 
 మనకి దేముళ్ళూ ఎక్కువె కానీ
దైవత్వం మాట దేముడెరుగు, 
మానవత్వం పొరపాటున ముందుకొస్తే,
 మందులోకి కనిపించం మనిషినే,నాగతం
 అనాదినుండీ క్రౌర్యానికి పునాదే. 
 నేచేసే ప్రతీదీ మోసం నాలో వున్న 
మృగం మృగయావినోదం నిజంగా 
ధరయా వికృతం అహ:నేనే

No comments:

Post a Comment